Home

»

Latest News

`రానే వ‌స్తాడు రామ‌య్య‌` అంటున్న బాల‌య్య‌!

Dec 05, 2021

`అఖండ‌` ఘ‌న‌విజ‌యం న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌లో నూత‌నోత్తేజాన్ని నింపింది. త్వ‌ర‌లో ఈ సీనియ‌ర్ స్టార్.. `క్రాక్` కెప్టెన్ గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్ లో ఓ యాక్ష‌న్ డ్రామా చేయ‌బోతున్నారు. వాస్త‌వ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందనున్న ఈ సినిమాలో మ‌రో ప‌వ‌ర్ ఫుల్ రోల్ లో క‌నిపించ‌బోతున్నారాయ‌న‌. అలాగే వ‌రుస విజ‌యాల ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడితోనూ ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేసే దిశ‌గా ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. 2022 జూలైలో ఈ బిగ్ టికెట్ ఫిల్మ్ ప‌ట్టాలెక్క‌నుంద‌ని బ‌జ్.

ఇదిలా ఉంటే.. గోపీచంద్, అనిల్ కాంబో మూవీస్ త‌రువాత సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో బాల‌య్య ఓ సినిమా చేస్తార‌ని టాక్. అంతేకాదు.. ఈ చిత్రానికి `రానే వ‌స్తాడు రామ‌య్య‌` అనే టైటిల్ ఫిక్స్ చేశార‌ని వినిపిస్తోంది. అలాగే, గీతా ఆర్ట్స్ ప‌తాకంపై అల్లు అర‌వింద్ ఈ సినిమాని నిర్మిస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి.. ఈ క‌థ‌నాల్లో వాస్త‌వ‌మెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.

కాగా, అల్లు అర‌వింద్ కి సంబంధించిన‌ `ఆహా` ఓటీటీ కోసం బాల‌య్య చేస్తున్న టాక్ షో `అన్ స్టాపబుల్`.. టైటిల్ త‌గ్గ‌ట్టే దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. `అన్ స్టాప‌బుల్`లాగే వీరి కాంబోలో వ‌చ్చే సినిమా కూడా సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందేమో చూడాలి మ‌రి.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com