2021 జ్ఞాపకాలుః స్టార్ బ్యూటీస్ కేరాఫ్ వెబ్ - సిరీస్
on Dec 14, 2021

కరోనా ఎఫెక్ట్ తో ఓటీటీ ట్రెండ్ ఊపందుకోవడంతో.. కొందరు అగ్ర తారలు వెబ్ - సిరీస్ లో నటించడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన ముగ్గురు అగ్ర కథానాయికలు ఓటీటీలో సిరీస్ లతో సందడి చేశారు.
Also read:2021 జ్ఞాపకాలుః `బౌన్స్ బ్యాక్` భామలు!
కాజల్ అగర్వాల్ః- కథానాయికగా 14 ఏళ్ళకి పైగా ఎంటర్టైన్ చేస్తున్న కాజల్ అగర్వాల్.. ఈ ఏడాది `లైవ్ టెలికాస్ట్` అనే వెబ్ - సిరీస్ లో సందడి చేసింది. హారర్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సిరీస్ లో రియాల్టీ షో `డార్క్ టేల్స్` డైరెక్టర్ జెన్నీఫర్ గా సందడి చేసింది కాజల్. కోలీవుడ్ కెప్టెన్ వెంకట్ ప్రభు రూపొందించిన ఈ సిరీస్ ఫిబ్రవరి 12న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అయి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయితే, కాజల్ మాత్రం ఎప్పటిలానే తన అభినయంతో ఆకట్టుకుంది.
Also read:టాప్5 మోస్ట్ ట్వీటెడ్ మూవీస్ 2021.. టాలీవుడ్ నుంచి 'వకీల్ సాబ్' ఒక్కడే!
తమన్నాః- 16 వసంతాలుగా నాయికగా రాణిస్తున్న తమన్నా ఈ సంవత్సరం ఏకంగా రెండు వెబ్ - సిరీస్ లతో పలకరించింది. ఏప్రిల్ 8న ఆహా ఓటీటీలో `లెవెన్త్ అవర్`(తెలుగు)తోనూ, మే 20న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో `నవంబర్ స్టోరీ`(తమిళ్)తోనూ పలకరించింది మిల్కీ బ్యూటీ. క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ రెండు సిరీస్ లోనూ తనదైన అభినయంతో అలరించింది. `లెవెన్త్ అవర్`ని టాలీవుడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు తీర్చిదిద్దగా.. `నవంబర్ స్టోరీ`ని తమిళ దర్శకుడు ఇంద్ర సుబ్రమణియన్ రూపొందించాడు. ఈ రెండు సిరీస్ లకి కూడా మిశ్రమ స్పందన వచ్చింది.
Also read:2021 జ్ఞాపకాలుః మెప్పించిన నవతరం దర్శకులు..
సమంతః- పదకొండేళ్ళుగా హీరోయిన్ గా ఇంప్రెస్ చేస్తున్న సమంత.. ఈ సంవత్సరం `ద ఫ్యామిలీ మ్యాన్ - సీజన్ 2`తో వెబ్ - సిరీస్ బాట పట్టింది. రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేసిన ఈ బ్లాక్ బస్టర్ సిరీస్ లో రాజీగా బోల్డ్ అండ్ పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్ లో మెస్మరైజ్ చేసింది సామ్. తన యాక్టింగ్ తో టాక్ ఆఫ్ ఇండస్ట్రీ అయ్యింది. ప్రధానంగా హిందీలో రూపొందిన ఈ సిరీస్.. దక్షిణాది భాషల్లోనూ అనువాద రూపంలో అలరించింది. సమంతకి పలు అవార్డులను అందించింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



