వైరల్ అవుతున్నప్రియాంక చోప్రా లేఖ..మహేష్, రాజమౌళి సినిమా గురించే
on Mar 19, 2025
మహేష్(Mahesh babu)రాజమౌళి(Rajamouli)కలయికలో రూపొందుతున్న ssmb 29 షూటింగ్ రెండు వారాల నుంచి ఒడిస్సా లోని కోరాపుట్ జిల్లాలో జరుగుతుంది.ఈ షెడ్యూల్ లో మహేష్ తో పాటు ప్రియాంక చోప్రా,పృథ్వీ రాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran)పై కొన్ని కీలక సన్నివేశాలని చిత్రీకరించినట్టుగా తెలుస్తుంది.అందుకు సంబంధించిన కొన్ని వర్కింగ్ స్టిల్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.రీసెంట్ గా చిత్ర బృందం కోరాపుట్ షెడ్యూల్ ని ముగించుకుంది.
ఈ సందర్భంగా కొరాపుట్ ప్రజలకి కృతజ్ఞతలు చెప్తు రాజమౌళి,ప్రియాంకచోప్రా(Priyanka Chopra)ఒక లేఖ ని రాయడం జరిగింది.ఈ మేరకు కొరాపుట్ ప్రభుత్వ అధికారులకి ఆ లేఖని అందచేయగా ఇప్పుడు అది సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా నిలిచింది.దీంతో కొరాపుట్ లోని భారీ జనసందోహం మధ్య చిత్రీకరణ జరిపి ఉంటారని అభిమానులు తో పాటు మూవీ లవర్స్ భావిస్తున్నారు.
ssmb 29 విషయంలో రాజమౌళి మొదట నుంచి కూడా షూటింగ్ కి సంబంధించిన వివరాలని అధికారకంగా వెల్లడి చెయ్యడం లేదు.మహేష్ కూడా ఇదే సూత్రాన్ని పాటిస్తున్నాడు.అగ్ర రచయిత విజయేంద్రప్రసాద్ కథ ని అందిస్తున్న ssmb 29 అమెజాన్(Amazon)అడవుల నేపథ్యంలో అడ్వెంచర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది.ఈ విషయాన్నీ విజయేంద్రప్రసాద్ నే చాలా ఇంటర్వ్యూ లలో చెప్పుకొచ్చాడు.దుర్గ ఆర్ట్స్ పతాకంపై కె ఎల్ నారాయణ అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తుండగా ప్రపంచ నటీనటులు భాగస్వామ్యం కానున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
