'దక్ష' చిత్రంలో మోహన్ బాబు స్పెషల్ రోల్!
on Mar 19, 2025
మంచు ఎంటర్ టైన్మెంట్, శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న మెడికల్-సైకలాజికల్ థ్రిల్లర్ 'దక్ష'. ఈ చిత్రంలో ప్రొఫెసర్ డా. విశ్వామిత్ర అనే ప్రత్యేక పాత్రలో మంచు మోహన్ బాబు కనిపించనున్నారు. మార్చి 19న మోహన్ బాబు జన్మదినాన్ని పురస్కరించుకుని, ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ చిత్ర బృందం ప్రత్యేక పోస్టర్ ను విడుదల చేసింది. ఈ పోస్టర్ లో మోహన్ బాబు లుక్.. పవర్ ఫుల్ గా ఉంది. (Manchu Mohan Babu)
వంశీ కృష్ణ మల్లా దర్శకత్వం వహిస్తున్న దక్ష చిత్రంలో మంచు లక్ష్మీ ప్రసన్న, మార్కో స్టార్ సిద్ధిక్, సముద్రఖని, విశ్వంత్, చిత్రా శుక్లా, మహేష్, వీరేన్ తంబిదొరై తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మోహన్ బాబు, మంచు లక్ష్మీ ప్రసన్న నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అచ్చు రాజమని సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి గోకుల్ భారతి సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నారు. డైమండ్ రత్న బాబు కథ అందించారు. దక్ష చిత్రం ఈ వేసవిలో విడుదల కానుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
