జక్కన్న మహాభారతంలో భీష్ముడిగా రజనీ..?
on Feb 13, 2017
.jpg)
బాహుబలి సినిమాతో వరల్డ్ వైడ్ పాపులారిటీని సంపాదించుకున్నాడు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. ఆయన దర్శకత్వంలో పనిచేయడానికి సౌత్ స్టార్స్‌తో పాటు బాలీవుడ్ సూపర్‌స్టార్స్ సైతం తహతహలాడుతున్నారు. ఆయన సినిమాలో ఒక్క పాత్ర పోషించినా చాలు జన్మధన్యం అనుకుంటున్నారంటే జక్కన్న క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. అలాంటి రాజమౌళి దర్శకత్వంలో సౌతిండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తే..పాత రికార్డులన్నీ గల్లంతే. ప్రస్తుతం జక్కన్న బాహుబలి పనులతో బిజీగా ఉన్నాడు..
దాని తర్వాత తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతాన్ని పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నట్లు టాలీవుడ్ టాక్..ఇప్పటికే స్క్రిప్ట్‌పై కసరత్తు పూర్తి చేసిన జక్కన్న..నటీనటుల ఎంపికపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మహాభారతంలో ఒక ముఖ్య పాత్ర కోసం రాజమౌళి రజనీని సంప్రదించినట్లు కోలీవుడ్ కోడై కూస్తోంది..తమిళ మీడియా అంచనా ప్రకారం భీష్ముడి పాత్ర రజనీ పోషించనున్నాడట. దీనిలో నిజమెంత ఉందో తెలియదు కానీ ఈ వార్త ఇప్పుడు కోలీవుడ్, టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



