డ్రంకన్ డ్రైవ్‌లో అడ్డంగా దొరికిన రాజమౌళి కొడుకు
on Feb 8, 2017

తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయిలో చాటి చెప్పారు దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి. మరి ఆయన కొడుకు ఎలా ఉంటాడు..ఏం చేస్తూ ఉంటాడు..తండ్రి లాగే డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో అడుగుపెడతాడా అని అంతా అనుకుంటారు. కానీ జక్కన్న కుమారుడు కార్తీకేయ మాత్రం తప్ప తాగి పోలీసులకు పట్టుబడ్డాడట..ఈ విషయం స్వయంగా కార్తీకేయ చెప్పారు. ఇటీవల జరిగిన షో టైమ్ ఆడియో రిలీజ్ కార్యక్రమంలో మాట్లాడిన కార్తీకేయ తాను ఒకసారి ఫుల్లుగా తాగి కారు డ్రైవ్ చేస్తున్నాని కానీ అప్పటికి మద్యం తాగి కారు నడపడం నేరమని తెలియదట. వారు తాగి నడపొద్దన్నారు కానీ తాగుతూ నడుపొద్దనలేదు కదా..? అందుకే తాను తాగుతూ డ్రైవ్ చేశానని..ఆ సమయంలో పోలీసులు అడ్డుకున్నారని అప్పుడు కానీ తనకు చేసిన తప్పు తెలియరాలేదని సభా ముఖంగా నేరాన్ని అంగీకరించాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



