సినిమా చుట్టేశారా.... గోవిందా!
on Feb 8, 2017

ఈరోజుల్లో ఏ సినిమా తీసినా క్వాలిటీ చాలా ముఖ్యం. సినిమా ఎలా ఉన్నా.. విజువల్‌గా గ్రాండ్‌గా లేకపోతే చుట్టేశారు.. అన్న ఫీలింగే వస్తుంది. చిన్న సినిమాలు సైతం రిచ్‌గా తీస్తున్న ఈ రోజుల్లో... బడా హీరోల సినిమా అంటే ఆ మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయడం తప్పు కాదు. అయితే... నాగార్జున - కె.రాఘవేంద్రరావు కలయికలో వస్తున్న ఓం నమో వేంకటేశాయ మాత్రం చాప చుట్టినట్టు చుట్టేశార్ట. సినిమా ఎమోషన్‌పరంగా స్ట్రాంగ్‌గా ఉందని, అయితే క్వాలిటీ మాత్రం అంతగా లేదని, ఈ సినిమా చూస్తుంటే చుట్టేసిన ఫీలింగ్ కలుగుతోందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
మరీ ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్ కి సంబంధించిన సీన్లు మరీ చీప్‌గా ఉన్నాయట. బాహుబలి, గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాల్ని చూసిన కళ్లతో ఓం నమో వేంకటేశాయ చూస్తే.. తేలిపోవడం ఖాయమని చెబుతున్నారు. అయితే నాగార్జున నటన, కీరవాణి పాటలు, క్లైమాక్స్ ఈ సినిమాని ఎక్కడికో తీసుకెళ్లాయట. విజువల్‌గా కూడా బాగుంటే... మరింత బాగుండేదన్నది అందరి అభిప్రాయం. మరి ఇవన్నీ గాలి వార్తలో, లేదంటే నిజంగానే సినిమాని చుట్టేశారో తెలియాంటే ఇంకొన్ని గంటలు ఆగితే సరిపోతోంది. ఈ శుక్రవారమే... ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది కదా? అందాకా.. వెయిట్ అండ్ సీ.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



