రేవ్ పార్టీ.. అతని వల్లే ఇదంతా.. శ్రీకాంత్ సంచలన వీడియో!
on May 20, 2024
బెంగళూరులో రేవ్ పార్టీ కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నట్లు వార్తలొచ్చాయి. ముఖ్యంగా నటి హేమ, నటుడు శ్రీకాంత్ పేర్లు కన్నడ మీడియాలో ప్రముఖంగా వినిపించాయి. ఇప్పటికే దీనిపై హేమ స్పందించింది. తాను హైదరాబాద్ లోనే ఉన్నానని, ఆ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలుపుతూ వీడియో రిలీజ్ చేసింది. తాజాగా శ్రీకాంత్ కూడా ఈ విషయంపై స్పందించాడు.
బెంగుళూరులో నిర్వహించిన రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తానసలు ఆ పార్టీకే వెళ్లలదేని శ్రీకాంత్ స్పష్టం చేశాడు. ఈ విషయంపై వివరణ ఇస్తూ తన ఇంట్లో నుంచే ప్రత్యేకంగా ఓ వీడియోను విడుదల చేశాడు.
శ్రీకాంత్ మాట్లాడుతూ.. "నేను హైదరాబాద్‌లోని మా ఇంట్లోనే ఉన్నాను. బెంగుళూరు రేవ్ పార్టీకి నేను వెళ్లినట్లు, పోలీసులు అరెస్ట్ చేసినట్లు నాకు ఫోన్ కాల్స్ వచ్చాయి. వీడియో క్లిప్స్ చూశాను. కొంతమంది మీడియా మిత్రులు నాకు ఫోన్ చేసి క్లారిటీ తీసుకోవటంతో నాకు సంబంధించిన వార్తలను వారు రాయలేదు. కొన్నింటిలో నేను బెంగుళూరులోని రేవ్ పార్టీకి వెళ్లానని వార్తలు వచ్చాయి. ఆ న్యూస్ చూసి నాతో సహా మా కుటుంబ సభ్యులందరూ నవ్వుకున్నాం. మొన్నేమో నా భార్యతో నాకు విడాకులు ఇప్పించేశారు. ఇప్పుడేమో రేవ్ పార్టీకెళ్లానని అన్నారు. వార్తలు రాసిన వాళ్లు తొందపడటంలో తప్పులేదనిపించింది. ఎందుకంటే రేవ్ పార్టీలో దొరికిన అతనెవరో కానీ, కొంచెం నాలాగే ఉన్నాడు. అతడికి కాస్త గడ్డం ఉంది. ముఖం కవర్ చేసుకున్నాడు. నేనే షాకయ్యాను. దయచేసి ఎవరూ నమ్మొద్దు. ఎందుకంటే రేవ్ పార్టీలకు, పబ్స్ వెళ్లే వ్యక్తిని కాను నేను. ఎప్పుడైనా బర్త్ డే పార్టీలకు వెళ్లినా కొంత సేపు అక్కడి ఉండి వచ్చేస్తానంతే. రేవ్ పార్టీ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. మీడియా మిత్రులు సహా ఎవరూ నమ్మొద్దు. విషయం తెలుసుకోకుండా.. రేవ్ పార్టీలో పట్టుబడ్డ శ్రీకాంత్ అంటూ థంబ్ నెయిల్స్ పెట్టేసి రాసేస్తున్నారు. నాలాగా ఉన్నాడనే మీరు పొరబడి ఉంటారని నేను అనుకుంటున్నాను. నేను ఇంట్లోనే ఉన్నాను. దయచేసి తప్పుడు కథనాలను నమ్మొద్దు" అన్నాడు.
Also Read