సంపాదించిన డబ్బంతా పోయిందనేది నిజమంటున్న రాజమౌళి
on May 20, 2024
ఎస్ ఎస్ రాజమౌళి.. ఇది కేవలం పేరు కాదు బ్రాండ్. తెలుగు సినిమాకే ఒక బ్రాండ్ అని చెప్పవచ్చు. ప్రపంచ సినిమా ఆధునికత తో పరుగులు పెడుతున్న టైం లో మగధీర, ఈగ, బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలని తెరకెక్కించి తెలుగు సినిమాకి ప్రపంచ సినీ మ్యాప్ లో స్థానాన్ని కలిపించాడు.టైటానిక్, అవతార్, టెర్మినేటర్ చిత్రాల సృష్టికర్త, ప్రపంచంలోనే నెంబర్ వన్ డైరెక్ట్ గా పేరు గాంచిన జేమ్స్ కెమరున్ చేత కూడా కీర్తింప బడ్డాడు. అలాంటి రాజమోళి తాజాగా చెప్పిన ఒక విషయం టాక్ అఫ్ ది డే గా నిలిచింది
ప్రముఖ టెలివిజన్ ఛానల్ ఈటీవీ స్వర్గీయ గేయరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి నివాళిగా నా ఉఛ్వాసం కవనం అనే ఒక ప్రోగ్రాం ని ప్రారంభించింది. మొదటి గెస్ట్ గా దర్శక ధీరుడు రాజమౌళి హాజరయ్యాడు. ఆద్యంతం ప్రేక్షకులని కళ్ళు కదల్పకుండా కట్టిపడేసిన ఈ షో లో జక్కన్న చెప్పిన పలు విషయాలు ఆసక్తికరంగా మారాయి. రాజమౌళి తండ్రి పేరు విజయేంద్ర ప్రసాద్. ఆయన మంచి కథకుడు కూడా. రాజమౌళి ఫస్ట్ మూవీ స్టూడెంట్ నెంబర్ వన్ తప్ప మొన్న ఆర్ ఆర్ ఆర్ వరకు రాజమౌళి దర్శకత్వం వహించిన అన్ని సినిమాలు ఆయనే కథ అందించాడు. 1996 లో ఆనంద్, రవళి జంటగా అర్దాంగి అనే సినిమాని విజయేంద్ర ప్రసాద్ సొంతంగా నిర్మించాడు. సినిమా ఫెయిల్ అవ్వడంతో సంపాదించిన డబ్బంతా పోయింది. దీంతో విజయేంద్రప్రసాద్ తీవ్ర నిరాశకి లోనయ్యాడు. దాంతో జక్కన్న తన తండ్రి కోసం ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి అనే పాట రాయమని శాస్త్రిగారిని అడిగాడు. ఆ పాట విజయేంద్ర ప్రసాద్ లో ధైర్యాన్ని తెచ్చింది. పలు సందర్బాల్లో జక్కన్న లో కూడా ధైర్యాన్ని నింపింది. ఈ విషయాలన్నీ స్వయంగా జక్కన్న నే చెప్పాడు
ఇక ప్రపంచ నలుమూలాలు ఉన్నట్టే శాస్తిగారికి మా ఇంట్లోను అభిమానులు ఉన్నారని, సినిమా పరిశ్రమలో తనని నంది అని పిలిచేది శాస్త్రి గారు ఒక్కరే అని కూడా చెప్పాడు. బాహు బాలి సినిమా తీసే ముందు శాస్త్రి గారిని కలిసి సలహా తీసుకున్నాం. ఆర్ ఆర్ ఆర్ లోని రెండు పాటలని శాస్తిగారు రాసారు. దోస్తానా పాట పూర్తిగా రాస్తే నెత్తురు మరిగితే ఎత్తర జండా మాత్రం ఆరోగ్యం సహకరించక పూర్తిగా రాయలేక పోయారు. దాంతో కొన్ని పదాలని రాసి ఇచ్చి వాడుకోమని చెప్పారని కూడా ఆయన తెలిపాడు
Also Read