శ్రీదేవి కడచూపు కోసం ముంబై కదలిన దక్షిణాది
on Feb 26, 2018
.jpg)
దుబాయ్ అధికారులు క్లియరెన్స్ ఇవ్వడంతో, మరి కాసేపట్లో శ్రీదేవి పార్థీవ దేహాన్ని ఆమె కుటుంబ సభ్యులకి అప్పగించనున్నారు. అనిల్ అంబానీ పంపించిన ప్రైవేట్ జెట్ లో శ్రీదేవి పార్థీవ దేహాన్ని ముంబై కి తీసుకురానున్నారు. అంత్యక్రియలు ఈ రోజు సాయంత్రం జరగనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే, శ్రీదేవి మృతి పట్ల తమ సంతాపం ప్రకటించిన దక్షిణాది అతిరథమహారధులందరూ ఆమె కడచూపు కోసం ముంబై తరలి వెళుతున్నారు. కొందరు ఇప్పటికే చేరుకుంటే, మరికొందరు మధ్యాహ్నం కల్లా వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు. తమిళనాడులోని శివకాశిలో జన్మించిన శ్రీదేవి దక్షిణాదిలో అగ్రనటిగా ఎదిగే క్రమంలో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా తన సత్తా చాటారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం మరియు హిందీ లో అగ్ర నటులందరి సరసన నటించిన శ్రీదేవికి స్టార్స్ లో కూడా అభిమానుల సంఖ్య ఎక్కువే. అలాంటి శ్రీదేవి హఠాత్మరణం ప్రతి ఒక్కరికి విస్మయాన్ని కలిగించింది. కడచూపు చూసి వీడ్కోలు పలికేందుకు తెలుగు, తమిళ్ మరియు ఇతర ఇండస్ట్రీ ల నుండి పలువురు సెలబ్రిటీ లు ముంబై తరలి వెళ్తున్నారు. కృష్ణ, చిరంజీవి, రజినీకాంత్, నాగార్జున, వెంకటేష్, భారతీరాజా, రాఘవేంద్ర రావు, అంబరీష్, ప్రకాష్ రాజ్ లు శ్రీదేవి అంత్యక్రియలకు హాజరవనున్నారని సమాచారం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



