క్షమాపణలు కోరిన శ్రీముఖి...జై శ్రీరామ్ అంటూ వీడియో రిలీజ్
on Jan 8, 2025
ఈ మధ్య కాల్యంలో ప్రోగ్రామ్స్ కి హోస్ట్ చేస్తున్న వాళ్ళు చాలా తప్పులు మాట్లాడేస్తున్నారు. కానీ తప్పు జరిగిపోయాక క్షమాపణలు వీడియోస్ ని రిలీజ్ చేస్తున్నారు. శ్రీముఖి విషయంలో కూడా జరిగింది. యాంకర్ శ్రీముఖి ఇటీవల హోస్ట్ చేసిన "సంక్రాంతికి వస్తున్నాం" మూవీ ఈవెంట్‌లో రామలక్ష్మణుల పై కాంట్రవర్సీ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో శ్రీముఖి క్షమాపణలు కోరుతూ ఓ వీడియోని రిలీజ్ చేసింది. "ఇటీవల నేను హోస్ట్ చేసిన ఒక సినిమా ఈవెంట్‌లో రామలక్షణులను ఫిక్షనల్ అనడం జరిగింది. నేనూ ఒక హిందువునే.. నేను రాముడిని అమితంగా నమ్మేదానిని. నేను చేసిన ఈ పొరపాటు వల్ల చాలా మంది మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇంకెప్పుడూ ఈ పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడతాననని మీ అందరికీ మాట ఇస్తూ, మీ అందరినీ క్షమాపణలు కోరుతున్నాను.
దయచేసి పెద్ద మనసుతో నన్ను క్షమిస్తారని వేడుకుంటున్నాను. జై శ్రీరామ్ " అంటూ శ్రీముఖి చెప్పింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్రీముఖి క్షమాపణలపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది శ్రీముఖి తప్పు తెలుసుకోవడం మంచిదే అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి కొంతమంది ఎప్పుడైనా సున్నితమైన అంశాల గురించి మాట్లాడేటప్పుడు ఇకనైనా జాగ్రత్తగా ఉండు అంటూ సూచిస్తున్నారు. "ఉద్దేశపూర్వకంగా ఎవరు అనరు..ఏదో తెలియక అన్నావు అని..చిన్నపిల్ల ఐనా క్షమాపణ అడుగుతున్నావు... శ్రీముఖి ఇది చాలు.. నువ్వెంటో తెలియటానికి...మీరైనా తప్పు ఒప్పుకుని క్షమాపణ అడిగారు..అందరిలాగా ఇగోకి పోకుండా..జై శ్రీరామ్" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read