మూడు కర్మలు అనుభవించాలి..సంక్రాంతి వేడుకల్లో మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు
on Jan 8, 2025
తెలుగు ప్రజలు అభిమానించే కథానాయకుల్లో మంచు మోహన్ బాబు(MOhanbabu)కూడా ఒకడు.1975 లో దాసరి నారాయణరావు(Dasari narayanarao)దర్శకత్వంలో వచ్చిన 'స్వర్గంనరకం'అనే మూవీతో సినీ రంగ ప్రవేశం చేసిన మోహన్ బాబు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఎంతో మంది అభిమానులని సంపాదించాడు.ప్రస్తుతం తన తనయుడు విష్ణు(Vishnu) హీరోగా చేస్తున్న 'కన్నప్ప'(Kannappa)అనే చారిత్రాత్మక మూవీలో ఒక కీలకమైన క్యారెక్టర్ లో చేస్తుండటమే కాకుండా వన్ అఫ్ ది ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరిస్తున్నాడు.
ఇక మోహన్ బాబు ప్రతి సంవత్సరం తిరుపతి రంగం పేట లోని తన మోహన్ బాబు యూనివర్సిటీ లో సంక్రాంతి వేడుకల్నినిర్వహిస్తుంటాడు.ఈ సంవత్సరం కూడా ఎప్పటిలాగానే యూనివర్సిటీ లో సంక్రాంతి వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తున్నాడు.స్వయంగా ఆ వేడుకల్లో తను కూడా విద్యార్థులతో పాల్గొని ఇప్పటి తరం మర్చిపోయిన సంక్రాంతి సందర్భంగా ఆడే పాత తరం ఆటలన్నీ విద్యార్థుల చేత అడిస్తున్నాడు.ఈ సందర్భంగా మోహన్ బాబు మీడియాతో మాట్లాడుతు ఆగామి కర్మ,సంచిత కర్మ,ప్రారబ్ధ కర్మ అని మూడు కర్మలు ఉంటాయి.జరగనున్నది జరగకుండా మానదు.
కానున్నది కాక మానదు.పోనున్నది పోక మానదు.భగవంతుడ్ని దర్శనం చేసుకొని సాష్టంగ నమస్కారం చేసినా కూడా మనం ఎన్ని జన్మల్లో పాపాలు చేసినా,మన తల్లి తండ్రులు చేసినా పాపాల వలన,మనం కర్మలని అనుభవించక తప్పదని చెప్పుకొచ్చాడు. ఇటీవల తన చిన్న కొడుకు మనోజ్(manoj)కి,మోహన్ బాబు కి మధ్య జరిగిన గొడవ దృష్త్త్యా ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు చర్చినీయాంశమయ్యాయి.
Also Read