రకుల్‌ను మరచిపోయిన మురుగదాస్..మహేశ్..!
on Sep 15, 2017
.jpg)
ఒక సినిమా ఈవెంట్ జరుగుతుందంటే ఆ ప్రాజెక్ట్‌లో పాలు పంచుకున్న వారందరి గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉంటారు. సినిమా అన్నాకా హీరో ఎంత ముఖ్యమో..హీరోయిన్ కూడా అంతే..అలాంటి ఈవెంట్ జరుగుతున్నప్పుడు చిన్న టెక్నీషియన్ గురించి కూడా మాట్లాడిన వాళ్లు..కథానాయక గురించి చెప్పకపోతే పాపం ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంటుంది.? ఇప్పుడు అచ్చం అలాంటి పరిస్థితినే ఎదుర్కొంది రకుల్ ప్రీత్ సింగ్. తమిళ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేశ్ బాబు నటించిన స్పైడర్ ఫ్రి రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో మొదట మాట్లాడిన మురుగదాస్ రకుల్‌ను మరచిపోయాడు..ఆ తర్వాత తన తప్పు తెలుసుకుని రకుల్ ప్రీత్ సింగ్‌ను పొగిడారు..ఇక చివర్లో మాట్లాడిన సూపర్‌స్టార్ మహేశ్ బాబు కూడా ప్రతి ఒక్క టెక్నీషియన్‌ను పేరు పేరునా చెప్పుకొచ్చి..హీరోయిన్‌ను మరచిపోయాడు..చివర్లో యాంకర్ చేతికి మైక్ ఇచ్చే సమయంలో నాలుక కరచుకొని రకుల్ గురించి చెప్పాడు. అయితే ఈ రెండు సమయాల్లోనూ రకుల్ ప్రీత్ సింగ్ చిరునవ్వులు చిందిస్తూనే ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



