నాగార్జున స్థానానికి ఎసరుపెట్టనున్న పవర్ స్టార్?
on Sep 16, 2017

అభిమానుల సంఖ్యలో పవర్ స్టార్ ది ఫస్ట్ ప్లేస్ అని అందరికీ తెలిసిందే. కానీ... ట్విట్టర్ ఫాలోవర్స్ లో మాత్రం ఆయన కాస్త వెనకడే ఉన్నాడు. అయితే... ఇప్పుడిప్పుడు ట్విట్టర్ పరంగా కూడా ఒక్కొక్కర్నీ దాటుకుంటూ ముందుకొచ్చేస్తున్నాడు. త్వరలో నంబర్ వన్ అయినా ఆశ్చర్యం లేదు.
రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పట్నుంచీ జనంతో మమేకం అవ్వడానికీ... సమస్యలపై గళం విప్పడానికీ.. ఎక్కువగా పవన్ కల్యాణ్... ట్విటర్ నే సాథకంగా తీసుకుంటున్నారు. ప్రస్తుతం ట్విట్టర్ లో పవన్ ఫాలోవర్స్ సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది. అక్షరాలా... 20, 07, 899 మంది ఫోలోవర్స్ ఇప్పుడు పవర్ స్టార్ సొంతం. అతి వేగంతో పెరిగిన సంఖ్య ఇది. ప్రస్తుతం ట్విట్టర్ లో ర్యాంకింగ్ పరంగా చూస్తే... మహేశ్ బాబు నంబర్ వన్ గా ఉన్నాడు. ఆ తర్వాత స్థానం సిద్ధార్థ్ ది. మూడో స్థానంలో రానా ఉంటే... 4వ స్థానం నాగార్జున సొంతం చేసుకొని ఉన్నాడు. ప్రస్తుతం పవర్ స్టార్ స్థానం 5.
ట్రెండ్ బట్టి చూస్తుంటే... నాగార్జున ప్లేస్ కి అతి త్వరలోనే ఎసరు పెట్టలా ఉన్నాడు పవర్ స్టార్. తన ఫాలోవర్స్ సంఖ్య 20 లక్షలు దాటగానే... ఎంతో సంతోషం వ్యక్తం చేశాడు పవర్ స్టార్. వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ... ఓ పోస్ట్ కూడా పెట్టాడు.
‘మూడేళ్ల క్రితం జనసేన ప్రయాణం
మొదలుపెట్టినప్పుడు...
దారంతా గోతులు..
చేతిలో దీపం లేదు..
ధైర్యమే కవచంగా
ఒకే గొంతుకతో మొదలుపెట్టాను.
నేను స్పందించిన ప్రతి సమస్యకూ
మేమున్నామని ప్రతిస్పందించి..
ఈ రోజు 20 లక్షల పైగా దీపాలను
దారంతా వెలిగించిన మీ అభమానానికి
శిరస్సు వంచి కృతజ్ఞతలతో
మీ పవన్ కల్యాణ్’
-------------------
ఇది ఆయన పోస్ట్ సారాంశం. దీనికి పవన్ అనుంగు అనుచరుడు బండ్ల గణేశ్ ‘పవర్ స్టార్ స్టామినా అది’ అని పోస్ట్ చేశాడు. ఇప్పటికే 7వేలకు పైగా కామెంట్లు.. మూడు వేలకు పైగా లైక్ లు వచ్చేశాయ్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



