ఎస్పీ బాలు సతీమణికీ కరోనా!
on Aug 15, 2020

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న నేపథ్యంలో ఇళయరాజా, చిరంజీవి, ఏఆర్ రెహమాన్, దేవిశ్రీ ప్రసాద్, తమన్, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్లు చేశారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తోంది. మరోవైపు ఒక తమిళ ఛానల్‌లో ఎస్పీ బాలు ఆరోగ్యంపై వచ్చిన పుకార్లను ఆయన తనయుడు చరణ్ ఖండించారు. ఇదిలా ఉండగా... ఎస్పీ బాలు సతీమణి సావిత్రి సైతం కరోనా బారిన పడ్డారు.
ఎస్పీబీ భార్య సావిత్రికి శుక్రవారం కొవిడ్19 పరీక్షలు నిర్వహించగా ఆమెకు పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. అయితే, ఆమె ఆరోగ్యంపై ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఎస్పీబీ ఫ్యామిలీ వర్గాలు తెలిపాయి. ఎస్పీబీ సైతం త్వరగా కోలుకుంటారని చెబుతున్నారు. వదంతులను నమ్మవద్దని కోరారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



