'సడక్ 2' సహా డిస్‌లైక్స్‌లో టాప్ 10 యూట్యూబ్ వీడియోలివే!
on Aug 15, 2020
ఇటీవల విడుదలైన 'సడక్ 2' ట్రైలర్‌కు అమోఘమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటివరకూ దానికి 43 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అయితే దాన్ని ఎక్కువమంది వీక్షించింది అభిమానంతో కాదు, ద్వేషంతో. అందుకే 5.32 లక్షల లైక్స్ వచ్చిన ఆ ట్రైలర్‌కు ఏకంగా 9.7 మిలియన్ డిస్‌లైక్స్ వచ్చాయి. దీని డిస్‌లైక్స్ రేట్ 94.88 శాతం. యూట్యూబ్ హిస్టరీలోనే ఇది సరికొత్త రికార్డ్.
సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో మహేశ్ భట్, ఆయన కుమార్తె అలియా భట్‌పై తీవ్ర విమర్శలు రేకెత్తుతున్న సందర్భంలో, సుశాంత్ అభిమానులు వారిని తీవ్రంగా ద్వేషిస్తున్న సందర్భంలో వారి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో 'సడక్ 2' ట్రైలర్‌కు ఈ రేంజ్ డిస్‌లైక్స్ వచ్చాయి. మహేశ్ భట్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో ఆదిత్యరాయ్ కపూర్, అలియా భట్, సంజయ్ దత్, పూజా భట్ నటించారు. డిస్‌లైక్స్ విషయంలో ఇలాంటి నెగటివ్ రికార్డ్ ఉన్న టాప్ టెన్ యూట్యూబ్ వీడియోలేమిటో చూద్దామా...
1. సడక్ 2 ట్రైలర్
డిస్‌లైక్స్: 9.7 మిలియన్, డిస్‌లైక్ రేట్: 94.88 శాతం
2. కెన్ దిస్ వీడియో గెట్ 1 మిలియన్ డిస్‌లైక్స్?
డిస్‌లైక్స్: 4.8 మిలియన్, డిస్‌లైక్ రేట్: 93.78 శాతం
3. యూట్యూబ్ రివైండ్ 2018: ఎవ్విరివన్ కంట్రోల్స్ రివైండ్
డిస్‌లైక్స్: 18.1 మిలియన్, డిస్‌లైక్ రేట్: 86.34 శాతం
4. యూట్యూబ్ రివైండ్ 2019: ఫర్ ద రికార్డ్
డిస్‌లైక్స్: 9.1 మిలియన్, డిస్‌లైక్ రేట్: 72.69 శాతం
5. విటావో, లూయ్‌సా సోంజా - ఫ్లోర్స్
డిస్‌లైక్స్: 4.8 మిలియన్, డిస్‌లైక్ రేట్: 68.98 శాతం
6. ఇట్స్ ఎవ్విరిడే బ్రో
డిస్‌లైక్స్: 4.9 మిలియన్, డిస్‌లైక్ రేట్: 62.07 శాతం
7. జస్టిన్ బైబర్ - బేబీ
డిస్‌లైక్స్: 11.5 మిలియన్, డిస్‌లైక్ రేట్: 44.72 శాతం
8. జానీ జానీ యస్ పాపా
డిస్‌లైక్స్: 6.6 మిలియన్, డిస్‌లైక్ రేట్: 40.03 శాతం
9. లెర్న్ ఎగ్స్, కలర్‌ఫుల్ ఎగ్స్ ఆన్ ద ఫార్మ్, ఎడ్యుకేషనల్ కార్టూన్ ఫర్ చిల్డ్రన్
డిస్‌లైక్స్: 6.9 మిలియన్, డిస్‌లైక్ రేట్: 39.92 శాతం
10. బాత్ సాంగ్
డిస్‌లైక్స్: 4 మిలియన్, డిస్‌లైక్ రేట్: 39.77 శాతం
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
