యువకుడిని కాపాడిన సోనూసూద్.. రియల్ హీరోపై ప్రశంసలు!
on Feb 9, 2022

పాండెమిక్ సమయంలో ఎందరికో అండగా నిలిచి రియల్ హీరో అనిపించుకున్నాడు సోనూసూద్. మరోసారి ఆయన తన గొప్ప మనసుని చాటుకున్నాడు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడిని సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లి అతని ప్రాణాలను కాపాడాడు.
పంజాబ్ లోని మోగాలో కొట్కాపూర్ బైపాస్ వద్ద మంగళవారం అర్థరాత్రి ఓ కారు ప్రమాదానికి గురైంది. అదే సమయంలో అటుగా వెళ్తున్న సోనూసూద్ తన కారుని ఆపి తన టీమ్ తో కలిసి.. అపస్మారక స్థితిలో ఉన్న 19 ఏళ్ల యువకుడిని బయటకు తీసి, దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రమాదం జరిగిన కారుకు సెంట్రల్ లాక్ ఉండడంతో బాధితుడిని కారు నుండి బయటకు తీయడానికి కొంత సమయం పట్టినట్టు తెలుస్తోంది. సోనూ & టీమ్ సకాలంలో స్పందించి హాస్పిటల్ కి తరలించండంతో ఆ యువకుడు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నట్లు సమాచారం.
రోడ్డు ప్రమాదం జరిగిన యువకుడిని కాపాడటంలో సోనూసూద్ చూపిన చొరవపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



