"యస్.యమ్.యస్."శివ మనసులో శృతి
on Feb 10, 2012
కథ - శివ తండ్రిలేని యువకుడు. కొరియర్ బోయ్. అలాగే శృతి తల్లిలేని యువతి. శృతి రేడియో జాకీ గా పనిచేస్తుంటుంది. వీళ్ళిద్దరూ ఒకసారి రైల్లో కలుస్తారు. అయితే శృతి తాను ఎయిర్ హోస్టెస్ నని శివకు అబద్ధం చెపితే, శివ తాను మిలటరీలో పనిచేస్తున్నానని ఆమెకు అబద్ధం చెపుతాడు. తర్వాత వాళ్ళిద్దరూ మళ్ళీ కలసినప్పుడు తమ తమ ఒరిజినల్ వృత్తుల గురించి తెలుసుకుంటారు. అక్కణ్ణించీ వీళ్ళిద్దరి మధ్య టామ్ అండ్ జెర్రీ వార్ మొదలవుతుంది. ఒకరిని మరొకరు ఫూల్ ని చేయటం వంటివి బలంగానే జరుగుతుంటాయి. అయినా ఒకరంటే మరొకరికి చాలా ప్రేమ ఉంటుంది. కానీ ఎవరూ బయటపడరు...! ఒక రోజు శృతి తన ప్రేమను చెప్పటానికి శివ మందు కొడుతున్న బార్ లోకి వెళుతుంది. ఆ తర్వాతేమయింది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి.
విశ్లేషణ - తాతినేని సత్య తొలిచిత్రం "భీమిలీ కబడ్డీ జట్టు"విజయవంతమైంది. ఆ చిత్రంలో ఒక దర్శకుడిగా తానేంటో నిరూపించుకున్నాడు సత్య. ఈ చిత్రం కూడా అందుకు మినహాయింపు కాదు. స్క్రీన్ ప్లే బాగుంది. సినిమా ఆద్యంతమూ రన్ బాగుంది. టేకింగ్ పరంగా కూడా బాగుంది. నిర్మాణపు విలువలు కూడా బాగున్నాయి.
నటన - సూపర్ స్టార్ కృష్ణ గారి చిన్నల్లుడుగా, ప్రిన్స్ మహేష్ బాబుకి బావగా సుధీర్ కి ఫిల్మీ బ్యాగ్రౌండ్ బాగానే ఉంది. అలాంటి సుధీర్ కు హీరోగా ఇది తొలి చిత్రమైనా ఆ తడబాటు ఎక్కడా కనిపించకుండా చాలా బాగా నటించాడు. అతని నటనలో మంచి ఈజ్ ఉంది. బయట కనపడే సుధీర్ కీ స్క్రీన్ మీద కనపడిన సుధీర్ కీ చాలా తేడా ఉంది. బయట చాలా సైలెంట్ గా, బుద్ధిమంతుడిలా కనపడే సుధీర్ స్క్రీన్ మీద చాలా గోల చేస్తాడు. ఇక డ్యాన్స్ లు, ఫైట్స్ బ్రహ్మాండంగా చేశాడు. అన్నీ ఒరిజనల్ గా డూప్ లేకుండా, ఏ రోప్ సహాయం లేకుండా అతను చేసిన విన్యాసాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. కాకపోతే డైలాగ్ మాడ్యులేషన్ లో ఇంకొంచెం పట్టు సాధించాల్సి ఉంది. ఇక హీరోయిన్ కూడా బాగానే నటించింది. హీరో తల్లిగా నటించిన రోహిణి, హీరోయిన్ తండ్రిగా కాశీ విశ్వనాథ్ తదితరులు అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. హీరో ఫ్రెండ్ గా నటించిన చంటి, హీరోయిన్ అన్నగా నటించిన వెన్నెల కిశోర్ ల కామెడీ బాగానే పండింది.
సంగీతం - ఆడియో ఇప్పటికే సూపర్ హిట్టయ్యింది. అన్ని పాటలూ బాగున్నాయి. రీ-రికార్డింగ్ కూడా బాగుంది.
సినిమాటోగ్రఫీ - బాగుంది. ముఖ్యంగా పాటల్లో, ఫైట్స్ లో ఇంకా బాగుంది.
పాటలు - ఈ చిత్రంలోని పాటల్లోని సాహిత్యం అర్థవంతంగా, సందర్భోచితంగా ఉంది.
మాటలు - బాగున్నాయి...సినిమాలో అక్కడక్కడ మంచి కామెడీ పంచ్ లు పడ్డాయి.
ఎడిటింగ్ - నీట్ గా క్రిస్ప్ గా ఉండి బాగుంది.
ఆర్ట్ - ఇది కూడా చాలా బాగుంది.
కొరియోగ్రఫీ - చాలా చాలా బాగుంది. ఒక పాటలో హీరో మోకాళ్ళతో చేసిన మూన్ వాక్ అద్భుతంగా ఉంది. అలాంటి అబ్బురపరిచే స్టెప్స్ ఈ సినిమాలో బాగానే ఉన్నాయి. మొత్తానికి ఈ చిత్రంలోని కొరియోగ్రఫీ బాగుంది.
యాక్షన్ - సింపుల్ గా, సహజంగా ఉండి బాగుంది.
ఈ చిత్రం అవుట్ అండ్ అవుట్ యూత్ ఫుల్ ఫిల్మ్. అలాగని సెంటిమెంట్లు, కామెడీ లేవని కాదు. ఇది ఒక సినిమాకి అవసరమైన అన్నీ ఉన్న ఒక కంప్లీట్ ప్యాకేజ్.