"మిస్టర్ నోకియా" మార్చ్ 24 న రిలీజ్
on Feb 11, 2012
"మిస్టర్ నోకియా" మార్చ్ 24 న రిలీజ్ అవుతుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే రాకింగ్ స్టార్ మంచు మనోజ్ కుమార్ హీరోగా, కృతి కర్బందా, సనాఖాన్ హీరోయిన్లుగా, అని (ల్ కృష్ణ) దర్శకత్వంలో, డి.యస్.రావు నిర్మిస్తున్న విభిన్నకథా చిత్రం" మిస్టర్ నోకియా". ఈ చిత్రం ప్రస్తుతం డిజిటల్ ఇంటర్మీడియట్ వంటి సాంకేతిక కార్యుక్రమాలను చెన్నైలో ముగించుకుంది.
ముందుగా అనుకున్న దాని ప్రకారం "మిస్టర్ నోకియా" చిత్రం ఫిబ్రవరి 17 వ తేదీన విడుదల కావలసి ఉంది. కానీ కొన్ని అనివార్యకారణాలవల్ల ఈ "మిస్టర్ నోకియా" చిత్రం మార్చ్ 24 వ తేదీన విడుదలవుతుందని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. ఏ విషయం ఈ చిత్రం యూనిట్ ఇంకా అఫీషియల్ గా నిర్ణయించలేదు.