బాలకృష్ణపై సింగీతం శ్రీనివాసరావు వ్యాఖ్యలు..ఆదిత్య 369 టైటిల్ అందుకే పుట్టింది
on Apr 3, 2025
నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ(Balakrishna)కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన మూవీ ఆదిత్య 369(Aditya 369).ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై మొట్టమొదటిసారిగా టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కగా శ్రీకృష్ణ దేవరాయలు,కృష్ణ కుమార్ గా డ్యూయల్ రోల్ లో బాలకృష్ణ నటన నభూతో నభవిష్యత్తు.1991 లో వచ్చిన ఈ మూవీ 35 ఏళ్ళ తర్వాత రేపు (ఏప్రిల్ 4 )న రీ రిలీజ్ అవుతుంది.దీంతో నందమూరి అభిమానుల్లో సందడి వాతావరణం నెలకొని ఉండగా చిత్ర దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు(Singeetam Srinivasa rao)ప్రేక్షకులతో మూవీకి సంబంధించిన పలు విషయాలని పంచుకున్నారు.
ఆయన మాట్లాడుతు ఆదిత్య 369 ని ఇప్పుడున్న సాంకేతిక తో తెరకెక్కిస్తే బాగుండనే క్షణాలు ఎన్నో ఉన్నాయి.శ్రీకృష్ణ దేవరాయల కాలంలో తెరకెక్కిద్దామని అనుకున్నపుడు నా మదిలో బాలకృష్ణ ఒక్కరే మెదిలారు.ఎన్ టి ఆర్ గారు చేసిన శ్రీకృష్ణ దేవరాయలు క్యారక్టర్ ని మెప్పించడం మళ్ళీ బాలకృష్ణ గారికే సాధ్యమవుతుంది.అందుకే ఆ క్యారక్టర్ కి బాలకృష్ణ గారిని తప్ప మరొకర్ని ఊహించలేదు.టైం మిషన్ అనేది కాంతి వేగంకి సంబంధించింది.కాంతి అంటే సూర్యుడు కాబట్టి ఆయన మరో పేరు ఆదిత్య అని అనుకున్నాం. అదే సమయంలో బోయింగ్ 737 విమానం గుర్తుకు రావడంతో ఆదిత్య 369 అని ఫైనల్ చేసాం.
ఈ మూవీ సీక్వెల్ తో తన వారసుడు మోక్షజ్ఞని పరిచయం చెయ్యాలని బాలకృష్ణ గారు అనుకున్నారు కానీ కుదరలేదు.ఇప్పటకీ సీక్వెల్ చెయ్యాల్సిందే అని చెప్తుంటారు.హెచ్ జీ వేల్స్ రచించిన 'ది టైంమిషన్' పుస్తకాన్ని కాలేజీ రోజుల్లో చదివాను.అందులో సైన్స్,ఫిక్షన్ వంటి అంశాలు ఉన్నాయి.ఆ ఇన్ స్ప్రెషన్ తోనే ఆదిత్య 369 ని తెరకెక్కించానని చెప్పుకొచ్చారు.భారతీయ చిత్ర పరిశ్రమ దగ్గ దర్శక శిఖామణుల్లో సింగీతం శ్రీనివాస్ కూడా ఒకరు.1972 లో 'నీతి నిజాయితీ' అనే చిత్రంతో దర్శకుడుగా ప్రారంభించి,అన్ని రకాల జోనర్స్ కి సంబంధించిన చిత్రాలు తెరకెక్కించి తన సత్తా చాటారు.బహుశా ఇండియన్ చిత్ర పరిశ్రమలో సింగీతం గారిలా అన్ని రకాల జోనర్స్ ని టచ్ చేసిన దర్శకుడు మరొకరు లేరేమో.తరం మారింది,పంతులమ్మ, అమెరికా అమ్మాయి,సొమ్మొకడిది సోకొకడిది,మయూరి,పుష్పక విమానం,బృందావనం,భైరవ ద్వీపం,మేడమ్ వంటి చిత్రాలే అందుకు ఉదాహరణ.కన్నడ,తమిళ భాషల్లోను పలు చిత్రాలు తెరకెక్కించారు.చివరిగా 2013 లో వెల్ కం ఒబామా అనే చిత్రానికి దర్శకత్వం వహించిన సింగీతం వయసు ప్రస్తుతం 93 ఏళ్ళు.ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరుకి దగ్గరలో ఉన్న గూడూరు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
