బెదిరింపులు దృష్ట్యా రష్మిక కి భారీ పోలీసు బందోబస్తు
on Nov 3, 2024
నాగశౌర్య హీరోగా 2018 లో విడుదలైన ఛలో మూవీ ద్వారా తెలుగు ఇండస్ట్రీ కి పరిచయమైన కన్నడ భామ రష్మిక మందన్న(rashmika mandanna).గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, పుష్ప పార్ట్ 1 తో అగ్ర హీరోయిన్ గా ఎదిగిన రష్మిక,యానిమల్ తో అయితే పాన్ ఇండియా హీరోయిన్ అనే టాగ్ లైన్ కూడా పొందింది. ప్రస్తుతం తన చేతిలో పుష్ప పార్ట్ 2 , కుబేర,చావా,రెయిన్ బో, ది గర్ల్ ఫ్రెండ్, సికందర్ వంటి పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.
వీటిల్లో సికందర్(sikandar)మూవీ షూటింగ్ రీసెంట్ గా హైదరాబాద్ లో ప్రారంభమయ్యింది.బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ మూవీకి సంబంధించి రష్మిక, సల్మాన్ ల పై ఒక సాంగ్ పిక్చరైజ్ చేస్తున్నారు.ఇటీవల సల్మాన్ ని చంపుతామని కొంత మంది నుంచి బెదిరింపులు వచ్చిన దృష్ట్యా పోలీసులు చిత్ర యూనిట్ కి భారీ బందోబస్తును ని కల్పించారు. కేవలం సినిమాకి వర్క్ చేసే వాళ్ళని తప్ప ఎవరని అనుమతించడం లేదు.పైగా చిత్ర యూనిట్ కి సంబంధించిన ప్రతి ఒక్కరిని క్షుణంగా పరిశీలించిన తర్వాతే లోపలకి అనుమతినిస్తున్నారు. కనీసం పరిసర ప్రాంతాల్లోకి కూడా ఎవరని అనుమతించటం లేదు.
ఈ నెల ఏడు వరకు కంటిన్యూ గా షూటింగ్ జరగనుండగా, ఇందులో సాంగ్ తో పాటు కొంత టాకీ పార్ట్ ని కూడా చిత్రీకరిస్తున్నారు. తమిళ దర్శకుడు మురుగుదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో కాజల్ అగర్వాల్,సత్యరాజ్, ప్రతీక్ బబ్బర్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సల్మాన్, సాజిద్ నడియావాలా లు సంయుక్తంగా నిర్మిస్తున్న సికందర్ వచ్చే రంజాన్ కి థియేటర్స్ లో సందడి చేయనుంది.
Also Read