తెలుగు వారి వృత్తిపై కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు..రెడ్డి గారు కదా అన్నారు
on Nov 4, 2024
ప్రముఖ తమిళ సినీ నటి కస్తూరి(kasthuri)గురించి తెలియని దక్షిణ బారతీయ సినీ ప్రేక్షకుడు లేడంటే అతి శయోక్తి కాదు.1991 లో చిత్ర సీమలో అడుగుపెట్టిన కస్తూరి ఆ తర్వాత తమిళ్ తో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషలకి చెందిన ఎన్నో సినిమాల్లో చేసింది.ముఖ్యంగా తెలుగు లో వచ్చిన భారతీయుడు 2 , అన్నమయ్య చిత్రాలు నటిగా ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టాయి. రీసెంట్ గా జగపతి బాబు తో కలిసి సింబా అనే మూవీలో చేసి తన సత్తా చాటింది.
బిజెపీ పార్టీ సభ్యురాలైన కస్తూరి రీసెంట్ గా చెన్నైలో జరిగిన పార్టీ మీటింగ్ లో మాట్లాడుతు తమిళనాడుకి మూడు వందల సంవత్సరాల క్రితం రాజుల కాలంలో వాళ్ళ అంతఃపుర మహిళలకి సేవ చెయ్యడానికి తెలుగు వాళ్ళు తమిళనాడుకి వచ్చారు.అలా వచ్చిన వారంతా ఇప్పుడు తమది తమిళ జాతి అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు.ఎప్పుడో ఇక్కడకి వచ్చిన బ్రాహ్మణులని మాత్రం తమిళులు కాదని అంటున్నారు. అలా చెప్పడానికి వాళ్లెవరు.ఇతరుల ఆస్తులు లూటీ చెయ్యద్దు. ఇతరుల భార్య లపై మోజు పడవద్దు.ఒకరి కంటే ఎక్కువ భార్యలని చేసుకోవద్దని బ్రాహ్మణులూ చెప్తున్నారు. అందుకే వారికి వ్యతిరేఖంగా తమిళనాట ప్రచారం సాగుతుంది.
ప్రస్తుత తమిళనాడు గవర్నమెంట్ క్యాబినెట్ లో తెలుగు మాట్లాడే మంత్రులు ఐదుగురు ఉన్నారు.నేను హైదరాబాద్ లో నాలుగేళ్లుగా ఉంటున్నా.ఇక్కడున్న కొందరిని మీరంతా ద్రావిడ వాదులా అని అడిగాను. అంటే ఏంటని వాళ్ళు అడిగితే మీ కంటే ఎక్కువగా తెలుగు మాట్లాడే వాళ్ళు తమిళనాడు(thamilanadu)లో పదవి అనుభవిస్తున్నారు కదా అని చెప్పాను.వెంటనే వాళ్ళు కూడా అవును రెడ్డి గారు కదా అన్నారని కస్తూరి చెప్పుకొచ్చింది. ద్రావిడ సిద్ధాంతాన్ని అనుసరించే డిఎంకె పార్టీని ఉద్దేశించే కస్తూరి ఈ వ్యాఖ్యలు చేసింది.
Also Read