డిజెటిల్లు 2026 కల్లా లండన్ లో ఉన్నకోహినూర్ వజ్రాన్నిఇండియాకి తీసుకొస్తాడంటా
on Oct 15, 2024
డిజె టిల్లు, టిల్లు స్క్వేర్ తో ప్రేక్షకుల్లో తన కంటూ ఒక స్టైల్ ని క్రియేట్ చేసుకున్న హీరో సిద్దు జొన్నలగడ్డ(siddhu jonnalagadda)ఇప్పుడు లేటెస్ట్ గా తన గత చిత్రమైన కృష్ణ అండ్ హిజ్ లీల దర్శకుడు అయిన రవికాంత్ పేరేపు తో ఒక మూవీ చెయ్యబోతున్నాడు.అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా సిద్దు కి ఆ బ్యానర్ లో మూడో సినిమా.
ఇప్పుడు ఆ మూవీకి కోహినూర్(kohinoor)అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు.ఈ సందర్భంగా సితార సంస్థ అధినేత నాగవంశీ మాట్లాడుతు కోహినూర్ వజ్రాన్ని భారత్ కి తీసుకురావడమనే కథాంశంతో మా సినిమా తెరకెక్కుతుంది. ఈ చిత్రం ఘన విజయం సాధించి సిద్ధుకి,మాకు హ్యాట్రిక్ విజయాన్ని అందిస్తుంది. 2026 లో సినిమాని విడుదల చేస్తామని తెలిపాడు.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్నఈ మూవీకి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ త్వరలోనే తెలియనున్నాయి.
సిద్దు ప్రస్తుతం నీరజ కోన దర్శకత్వంలో తెలుసు కదా అనే మూవీతో చేస్తుండగా ప్రొడక్షన్ దశలో ఉంది.జాక్ అనే మరో మూవీకి కూడా కమిట్ అవ్వగా టిల్లు క్యూబ్ కూడా ఉంది. వీటి తర్వాతే కోహినూర్ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
Also Read