జానీమాస్టర్ బెయిల్ రద్దు.. మెయిన్ రీజన్ ఇదే
on Oct 15, 2024
తోటి డాన్సర్ పై లైంగిక వేధింపుల కేసులో పోక్సో యాక్ట్ నమోదు కావడంతో జానీ మాస్టర్(jani master)ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్న విషయం తెలిసిందే.కొన్ని రోజుల క్రితం ధనుష్ హీరోగా వచ్చిన తిరు లోని మేఘం కురిసింది పాటకి జానీ మాస్టర్ కి నేషనల్ అవార్డు వచ్చింది. దీంతో అవార్డు అందుకోవడానికి ఢిల్లీ వెళ్లాలని బెయిల్ కోరుతూ జానీ మాస్టర్ పిటిషన్ వేసాడు. కోర్టు అందుకు సమ్మతించి బెయిల్ మంజూరు చేసింది. కానీ అవార్డు కమిటీ జానీ మాస్టర్ పై నమోదు అయిన లైంగిక వేధింపుల కేసు దృష్ట్యా అవార్డుని నిలిపివేసింది.
దీంతో జానీ మాస్టర్ తన బెయిల్‌ను రద్దు చేసుకుని జైలుకు వెళ్ళాడు. మళ్ళీ వెంటనే బెయిల్ కోసం మరోసారి అప్పీల్ చేయగా కేసు విచారణలో ఉన్న దృష్ట్యా బెయిల్ ఇవ్వలేమని కోర్టు బెయిల్ పిటిషన్ ని కొట్టివేసింది. దీంతో జానీ మాస్టర్ కి ఎప్పుడు బెయిల్ లభిస్తుందో అనే ఆసక్తి అందరిలో ఉంది.జానీ మాస్టర్ తల్లి ఇటీవల అనారోగ్యంతో హాస్పిటల్ లో చేరిన విషయం అందరకి తెలిసిందే.
Also Read