కరణ్ జోహార్ శ్వేతాబసుకు లైఫ్ ఇస్తాడా..!
on Apr 13, 2016

కొత్త బంగారు లోకంతో, మంచి టాలెంట్ ఉన్న అమ్మాయిగా ప్రశంసలతో కెరీర్ ను మొదలెట్టింది శ్వేతా బసు ప్రసాద్. చిన్నతనంలోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా జాతీయ అవార్డు గెలిచినా శ్వేతకు తెలుగు సినిమా తర్వాతే గుర్తింపు లభించింది. ఆ తర్వాత సరైన అవకాశాలు లేకపోవడంతో తెరమరుగైన ఈ భామ, ఒక భారీ స్కాండల్ లో చిక్కుకుని కెరీర్ కు పూర్తిగా ఎర్త్ పెట్టేసుకుంది. ఆమె పేరైతే బయటికొచ్చింది కానీ, ఆ కేసులో నిజంగా ఆమె ఉందా..? ఉంటే ఆమె పాత్ర ఏంటి అనే కోణంలో పోలీసులకు పెద్దగా సాక్ష్యాధారాలు లభించలేదు. అదే సమయంలో, శ్వేతకు చాలా మంది మద్దతుగా నిలిచారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ నుంచి ఎంతో మందికి ఆమెకు మానసిక స్థైర్యాన్నిచ్చారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత, శ్వేత ముంబై వెళ్లిపోయింది. యూట్యూబ్ ఛానల్ ఏఐబీ తీసిన ఒక కామెడీ పేరడీలో కనబడి సర్ప్రైజ్ ఇచ్చింది. తాజాగా బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ నిర్మించే సినిమాలో శ్వేతాబసుకు అవకాశం దొరికిందట. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం, శ్వేతాబసు కెరీర్ మళ్లీ పుట్టినట్టే. సినీఫీల్డ్ లో టాలెంట్ ఉన్నా, అదృష్టం లేకపోతే ఏమవుతుందో శ్వేతా కెరీరే ఒక ఉదాహరణ. ఏదేమైనా, ఆమె కెరీర్ మళ్లీ పుంజుకోవాలని ఆశిద్దాం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



