బోయపాటికి బాలయ్యకు మధ్యలో చిరు.!
on Apr 13, 2016

బోయపాటి శ్రీనుకి, బాలయ్యకి మధ్య చిరంజీవి మంటపెట్టడమేంటి అసలు ఎవరైనా నమ్ముతారా? వరుస ఫ్లాప్‌లతో కెరిర్ ఏమవుతుందో అన్న టైంలో సింహా లాంటి హిట్‌నిచ్చి బాలయ్యను మళ్లీ హీరోగా నిలబెట్టారు బోయపాటి. మళ్లీ 2014 వచ్చిన లెజెండ్ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడినా తక్కువే. లెజెండ్ సినిమా ఎన్నో రికార్డ్స్‌ని తిరగరాయడంతో పాటు 675 రోజులు కూడా పూర్తి చేసుకుంది. ఎలక్షన్ టైంలో రావడంతో అటు టీడీపీలోనూ జోష్ నింపింది. అప్పటి నుంచి నందమూరి అభిమానులు శ్రీనుకి బ్రహ్మరథం పట్టారు. అటువంటి బోయపాటి మీద బాలయ్య సీరియస్ అవ్వడమేంటి?
వివరాల్లోకి వెళితే సరైనోడు ఆడియో ఫంక్షన్‌లో చిరంజీవి మాట్లాడిన మాటలు నందమూరి అభిమానులకు ఆగ్రహాం తెప్పించాయి. సరైనోడు వేదిక మీద బోయపాటిని ప్రశంసలతో ముంచెత్తారు చిరు. అదే సందర్భంలో శ్రీను బాలయ్యతో తీసిన సింహా, లెజెండ్ కథలను ముందుగా తానే విన్నానని, దానిలో నేను చెప్పిన మార్పులను బోయపాటి పాటించారన్నారు. చిరు మాటలను బట్టి చూస్తే సింహా, లెజెండ్ సినిమాల హిట్ల వెనుక తాను ఉన్నానన్నట్టు చెప్పడంతో నందమూరి అభిమానులు హర్ట్ అయ్యారు. ఈ విషయం బాలయ్యకు చేరడంతో పాటు పలు ప్రాంతాల్లో ఫ్యాన్స్ బోయపాటి పోస్టర్లను తగలబెట్టె వరకు వచ్చింది. సో చిరు మాటలు బాలయ్య, బోయపాటి మధ్య చిచ్చు రాజేసినట్లే అంటున్నారు సినీ విశ్లేషకులు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



