Home

»

Latest News

నా మాజీ భార్యకి చాలా మందితో ఎఫైర్స్.. ప్రముఖ నటిపై సంచలన వ్యాఖ్యలు 

Jul 29, 2026 3:13PM

 

బిగ్ స్క్రీన్, స్మాల్ స్క్రీన్ పై  తనకంటూ ఒక 'ఓరా' క్రియేట్ చేసుకున్న నటి శ్వేతా తివారి. ఆమె మాజీ భర్త పేరు జా చౌదరి. ఎన్నో మనస్పర్థలు, కోర్టు కేసులు, తీవ్ర గృహహింస ఆరోపణల మధ్య  ఆ ఇద్దరు   విడిపోయారు. రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రాజా చౌదరి తన మాజీ భార్య శ్వేతా తివారి వ్యక్తిగత ప్రవర్తనపై, ఆమెతో తనకున్న పాత అనుబంధంపై  వివాదాస్పదమైన వ్యాఖ్యలు చెయ్యడం సంచలనం సృష్టిస్తుంది.

  
రాజా చౌదరి మాట్లాడుతు 'శ్వేతా తివారికి  'కసౌటీ జిందగీ కే' సీరియల్ సహ నటుడు సెజాన్ ఖాన్‌తో  సంబంధం ఉంది. సెజాన్ ఖాన్ కారులోనే శ్వేతా షూటింగ్ స్పాట్‌కి వస్తుండటంతో పాటు  తరచూ సెజాన్ ఇంటికి వెళ్లేది. మా  ఉమ్మడి స్నేహితులు ఈ విషయాన్నీ  స్వయంగా వెల్లడించారు. కేవలం సెజాన్ ఖాన్ మాత్రమే కాకుండా, శ్వేతా అనేకమందితో సంబంధాలు కొనసాగించిందనే అనుమానాలు ఉన్నాయి. షూటింగ్‌కి  వెళ్తున్నానని చెప్పి వేరే ప్రాంతాలకు వెళ్లేది. నేను  స్వయంగా వెళ్లి చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక్కసారి నేరుగా సెజాన్ ఖాన్‌నే ప్రశ్నించగా, శ్వేతా నీతో ఉండదని, నువ్వు ఆమె ఇంట్లో కేవలం ఒక జీతం లేని పనివాడివి (బిన్పగారీ నోకర్) మరియు డ్రైవర్‌వి మాత్రమేనని సెజాన్ నాకు  సమాధానమిచ్చాడు. గత 18 ఏళ్ల కాలంలో నా  కూతురు పలక్ తివారితో తాను కేవలం 2 నుంచి 3 సార్లు మాత్రమే మాట్లాడగలిగాను. కూతురికి నన్ను  దూరం చేశారని రాజా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.

Also read: ఆ ముగ్గురిలో ఒకరు.. లెనిన్ పై థమన్ వ్యాఖ్యలు వైరల్ 

శ్వేతా తివారి, రాజా చౌదరి 1998లో  వివాహం చేసుకున్నారు. వివాహమైన రెండేళ్లకు అంటే 2000వ సంవత్సరంలో  కుమార్తె పలక్ తివారి జన్మించింది. అయితే, ఆ తర్వాత ఇద్దరి మధ్య కుటుంబ కలహాలు, ఆర్థికపరమైన విభేదాలు, రాజా చౌదరి మద్యపాన అలవాటు ఎక్కువయ్యాయి. దాంతో శ్వేతా తివారి ఆయనపై గృహహింస, భౌతిక వేధింపుల ఆరోపణలు చేస్తూ మీడియా ముందుకు వచ్చింది. 2007 నాటికే వీరిద్దరూ వేర్వేరుగా జీవించడం ప్రారంభించగా, ఐదేళ్ల సుదీర్ఘ కోర్టు పోరాటం తర్వాత 2012లో వీరికి అధికారికంగా విడాకులు మంజూరయ్యాయి. విడాకుల అనంతరం 2013లో శ్వేతా తివారి నటుడు అభినవ్ కోహ్లీని రెండో వివాహం చేసుకుంది. కానీ దురదృష్టవశాత్తు ఆ రెండో బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు; 2019లో తీవ్ర మనస్పర్థల కారణంగా వారూ విడిపోయారు. అయితే సెజాన్ ఖాన్‌తో  ఎలాంటి అఫైర్ లేదని, కేవలం పని సంబంధమైన  పరిచయమే అని  శ్వేతా తివారి ఎప్పటికప్పుడు చెప్పుకుంటూనే వస్తుంది.

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com