
అఖిల్ అక్కినేని(Akhil Akkineni)'లెనిన్'(Lenin)తో కెరీర్ లో భారీ విజయాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. విజయం మాత్రమే దక్కించుకోలేదు, వంద సినిమాలు చేసిన అనుభవమున్న నటుడిలా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో పెర్ఫార్మ్ తో చించిపాడేసాడు. దీంతో అఖిల్ నెక్స్ట్ మూవీ ఎప్పడెప్పడు షూటింగ్ కి వెళ్ళి కంప్లీట్ చేసుకొని తమ ముందుకొస్తుందా అని అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తూ ఉన్నారు
ఇక థమన్(Thaman)అందించిన సాంగ్స్ అయితే స్లో పాయిజన్ లాగా సంగీత ప్రియులకి మంచి కిక్ ఇస్తున్నాయి. రీసెంట్ గా థమన్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు లెనిన్ లో మాస్ స్పెషల్ ఐటెం సాంగ్ ని ప్లాన్ చేసాం. రాయలసీమ యాసలో ఉండేలా ఒక అదిరిపోయే మాస్ ఐటెం సాంగ్ ని కూడా కంపోజ్ చేశాను. ఈ స్పెషల్ సాంగ్ కోసం రష్మిక మందన్న, పూజా హెగ్డే, కయదు లోహర్, ప్రీతి ముఖుందన్ వంటి స్టార్ హీరోయిన్ల పేర్లను దర్శకనిర్మాతలు పరిశీలించారు. ఒకరిని ఫైనల్ చేసి షూటింగ్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరిగాయి. కానీ, సరిగ్గా షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కావడానికి కొద్ది సమయం ముందే స్పెషల్ సాంగ్ వద్దని అనుకున్నారు.
Also read: అనంత శ్రీరామ్ మరో సంచలనం.. బొమ్మ బొమ్మ అద్భుతం
అందుకు కారణం ఏంటంటే జరుగుతున్న కథనంకి ఐటెం సాంగ్ అడ్డుపడుతుందని, కథకు ఎలాంటి సంబంధం లేని ఐటెం నంబర్‌ను బలవంతంగా సినిమా మధ్యలో జోడిస్తే విడుదల తర్వాత విమర్శకుల నుంచి, ప్రేక్షకుల నుంచి అనవసర ప్రతికూల విమర్శలు వచ్చే ప్రమాదం ఉందని దర్శకుడు మరియు మేకర్స్ భావించారు. అంతేకాకుండా, షూటింగ్ జరగడానికి ముందే స్పెషల్ సాంగ్ గురించిన విశేషాలు మా వాట్సాప్ గ్రూపుల్లో విస్తృతంగా లీక్ కావడం నన్ను తీవ్ర నిరాశకు, తీవ్ర అసహనానికి గురిచేసింది. దీంతో వాట్సాప్ గ్రూపుల నుంచి కూడా బయటకు వచ్చేసినట్లు థమన్ ఎమోషనల్‌గా చెప్పుకొచ్చాడు.
Akhil Akkineni, Rashmika, Pooja Hegde Kayadu Lohar, Thaman, Lenin






