శృతిహాసన్ పెళ్లి చేసుకుందా?
on Jan 7, 2020
కమల్ హాసన్ గారాల కూతురు శృతిహాసన్ పెళ్లి చేసుకుందా? తరచూ సినిమా వార్తలు ఫాలో అయ్యే ప్రేక్షకుల ఎవరైనా ఈ ప్రశ్నకు ఇట్టే సమాధానం చెప్తారు. 'లేదు' అని! లండన్ నగరం లో సెటిల్ అయిన ఇటాలియన్ మైఖేల్ కోర్సలేతో కొన్నాళ్ళు ఆమె ప్రేమలో మునిగి తేలారు. ఏమైందో ఏమో తర్వాత ఇద్దరూ విడిపోయారు. ఇప్పుడు శృతిహాసన్ సినిమాలపై దృష్టి సారించారు. ఈ విషయాలన్నీ సగటు సినిమా ప్రేక్షకులకు తెలిసినవే. తెలియని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్లు 'నీకు పెళ్లి అయ్యిందా?' అని ప్రశ్నలు అడుగుతారు. ఈరోజు శృతిహాసన్ ఇన్ స్టాగ్రామ్ లో ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇచ్చారు. అందులో కొన్ని వింత ప్రశ్నలు - శృతిహాసన్ చెప్పిన సమాధానాలు చూడండి.
◼️ నిద్రపోయే ముందు పాలు తాగుతారా?
లేదు. నేను నిజంగా పాలు తాగను.
◼️ ఆర్ యు మ్యారీడ్? (మీకు పెళ్లి అయిందా?)
ఎమోజీతో రిప్లై (ఫ్రస్టేషన్... ఇరిటేషన్ కలిగినప్పుడు, బోర్ కొట్టినప్పుడు... ఉపయోగించే ఎమోజీ )
◼️ పబ్జి ఆడతారా?
నో
◼️ ఎవరినైనా ఎలా మరిచిపోవాలి? జీవితంలో ఎలా ముందుకు వెళ్లాలి?
మీ గురించి ఆలోచించండి. అదే మంచిది.
◼️ మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు?
స్మైలీ ఎమోజీ
◼️ తమిళం చదవడం.. రాయడం వచ్చా?
వచ్చు. కానీ, కొంచెం నెమ్మదిగా చదువుతా. రాస్తా.
◼️ నిజంగా చెప్పండి మీ బరువు ఎంత?
62 కేజీలు.
◼️ మీ హెయిర్ సీక్రెట్ ఏంటి?
కొబ్బరి నూనె
◼️ మీరు ఇప్పుడు ఎక్కడున్నారు?
సోఫాలో.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
