పవన్ డబ్బులు తిరిగిచ్చేసిన నాగబాబు..?
on Feb 28, 2018

నిర్మాతగా నాగబాబుకు కోలుకోలేని దెబ్బ ఆరెంజ్ సినిమా.. ఎంతో ఖర్చుపెట్టి తీసిన ఆ సినిమా ఆయనకు భారీ నష్టాలు మిగిల్చింది.. ప్రీ రిలీజ్ బిజినెస్‌లో ప్రాఫిట్ సంపాదించారని ప్రచారం జరగ్గా.. ఆ తర్వాత నష్టాలబాట పట్టడం నాగబాబుకు సైతం అంతుచిక్కలేదు. లెక్కలు చూసుకుంటే అయినవారే మోసం చేశారని తేలింది.. జరిగిన నష్టం కంటే.. నా అనుకున్న వాళ్లే.. వెన్నుపోటు పొడిచేసరికి ఆయన తట్టుకోలేకపోయారు. తీవ్ర మానసిక వేదనతో ఒకానొకదశలో నాగబాబు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్లు వార్తలు వచ్చాయి.
అయితే అన్నయ్య పరిస్థితి తెలుసుకున్న పవన్ కళ్యాణ్.. పెద్ద మొత్తంలో ఆర్థికసాయం చేసి.. నష్టాల నుంచి కాపాడారన్నది ఓపెన్ సీక్రెట్. అయితే తమ్ముడి రుణాన్ని నాగబాబు తీర్చుకున్నడన్నది లేటేస్ట్ అప్‌డేట్. బుల్లితెరపై బిజీగా ఉండటం.. వరుస సూపర్‌హిట్లతో కొడుకు సంపాదిస్తుండటం.. అన్నింటికంటే.. మా టీవీ పెట్టే సమయంలో.. చిరంజీవి సలహా మేరకు నాగబాబు కొన్ని షేర్లు కొన్నాడు. అప్పట్లో లక్షల్లో ఇన్వెస్ట్ చేస్తే.. ఇప్పుడు కోట్లు చేతికొచ్చాయి. ప్రజంట్ నాగబాబు ఫైనాన్షియల్‌గా బాగా సెటిలయ్యాడు. అందుకే పవన్ సొమ్మును తిరిగి ఇచ్చేశాడట.. తమ్ముడితో పాటు తనకు ఆనాడు సాయం చేసిన వారందరికీ నాగబాబు సెటిల్ చేసినట్లు ఫిలింనగర్ టాక్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



