అర్జున్‌రెడ్డి హీరోయిన్ బతికేవుంది..
on Sep 14, 2017

అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలినీ పాండే... ఓ మొబైల్ దుకాణం ఓపెనింగ్ కి నెల్లూరు వెళ్లి.. అక్కడ కాస్త అస్వస్తతకు గురైంది. అంతే.. ఆ పిల్ల మీద ఏదేదో అల్లేసి రాసేసింది సోషల్ మీడియా. కొందరైతే... ఒకడుగు ముందుకేసి షాలినీ చనిపోయిందని కూడా అన్నారు. దీంతో బెంబేలెత్తిపోయిన ఆ అమ్మాయి...ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టింది. ‘నాకు జ్వరం, తలనొప్పి ఉండటంతో హాస్పటల్ కి వెళ్లాను. దానికి ఇంత రాసేయడం కరెక్ట్ కాదు’అని. ఇదిలావుంటే... ఇటీవల ఆమె మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పింది. తెలుగులో ‘మహానటి’ సినిమాకు ఇటీవలే సైన్ చేసిందట. ‘మహానటి’ అంటే... సావిత్రి బయోపిక్ తెలుసుగా? మరి ఆ సినిమాలో ఈ అమ్మాయిది ఏ పాత్రో మరి. అందులో విజయ్ దేవరకొండ కూడా నటిస్తున్నాడండోయ్. అంతేకాదు... ‘100% లవ్’ తమిళ రీమేక్ కి కూడా ఇటీవలే ‘ఓకే’ చెప్పిందట. మరి సౌత్ సినిమాలకు చెకచెక ఒప్పేసుకుంటున్నావ్ కదా.. హైదరాబాద్ వచ్చేస్తావా? అనడిగితే... ‘నాది ముంబయ్. నేనుండేది కూడా ముంబాయ్ లోనే’ అని సింపుల్ గా సమాధానం ఇచ్చేసిందట షాలినీ.తెలుగులో నీకు ఇష్టమైన నటుడు ఎవరు? అని అడిగితే... తడుముకోకుండా ‘విజయ్ దేవరకొండ’ అని చెప్పేసింది. మనలో మనమాట.. ‘అర్జున్ రెడ్డి’ లో వారిద్దరి కెమెస్ట్రీ చూసిన తర్వాత కూడా... ఆ పేరు చెప్పక మరో పేరు చెబుతుందని ఎలా అనుకుంటాం చెప్పండి?
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



