కుట్రకు బలైపోతావ్ జాగ్రత్త!
on Sep 14, 2017

‘డియర్ టాలెంట్! నువ్వు ఓవర్ కాన్ఫిడెంట్. భ్రమ నుంచి దూరంగా ఉండాలని కోరుకుంటున్నా. వారు నీపై నిరంతరాయంగా కుట్రలు చేస్తారు. గమనించడం లేదా’... ఈ హెచ్చరిక వైరైటీగా ఉంది కదూ! దీన్ని పాస్ చేసింది ఎవరో తెలుసా? బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కరణ్ జోహార్. కాసేపటి క్రితమే తన ట్విట్టర్ లో ఈ హెచ్చరికను పోస్ట్ చేశాడు. ఇంతకీ ఈ హెచ్చరిక ఎవరికి.. అనుకుంటున్నారా? అర్థం కాలేదా? సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఎవరికైనా ఇట్టే అర్థమై పోతుంది. ఈ హెచ్చరిక కంగనా రనౌత్ కే అని. ఓ యూట్యూబ్ ఛానల్ తో కలిసి.. ‘బాలీవుడ్ దివా’ అనే సాంగ్ చేసింది కంగనా. ఆ సాంగ్ సోషల్ మీడియాలోనే కాదు, బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా పెను సంచలనం.
హన్సల్ మెహతా దర్శకత్వం వహించిన ఈ పాటతో... షారుఖ్, సల్మాన్, అమీర్, హృతిక్ లాంటి స్టార్లనూ... కరణ్ జోహార్, ఆదిత్య పాంచాలీ లాంటి దర్శకులనూ... చాలా బలంగా టార్గెట్ చేసింది కంగనా. దాంతో ఒళ్లు మండి... కరణ్ జోహార్ ఈ మెసేజ్ పోస్ట్ చేశాడు. అయితే... కంగనా ఐరన్ లేడీ. ఎలాంటి సమస్యనైనా.. ఇట్టే ఎదిరించగల ధృఢ సంకల్పం ఉన్న మహిళ. నటిగానే కాదు.. యాడిట్యూడ్ పరంగా కూడా ఆమె ‘క్వీన్’ లాంటిదే. అందుకే... ‘ఎక్కడా పేరు మెన్షన్ చేయకుండా.. భయం భయంగానే మేసేజ్ పోస్ట్ చేశాడు కరణ్ జోహార్’ అని బాలీవుడ్ లో అందరూ అనుకుంటున్నారు. మరి ముందు ముందు ఈ పాట ఇంకెన్ని గొడవలను కారణమవుతుందో. అసలు కరణ్ జోహార్ కామెంట్ పై కంగనా ఎలా స్పందిస్తుందో.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



