ముగ్గురుతో షాలిని పాండే రొమాన్స్!!
on Jun 21, 2019
ఫస్ట్ సినిమా `అర్జున్ రెడ్డి` తో సక్సెస్ అందుకున్న భామ షాలిని పాండే. మంచి కథలను ఎంచుకొని కెరీర్ లో దూసుకుపోతుంది. ఆమె నటించిన `అర్జున్ రెడ్డి`, `మహానటి`, `118` ఇలా మంచి విజయాలు సాధించాయి. ఇప్పుడు మరో డిఫరెంట్ రోల్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్దమైనట్టు వార్తలు వస్తున్నాయి. మహానటి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న అశ్వనీదత్ తనయ స్వప్నదత్ నిర్మిస్తున్న సినిమాలో షాలిని పాండేకు అవకాశం దక్కినట్టు తెలుస్తోంది. పిట్టగోడ ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో కమెడియన్లు ప్రియదర్శి ,రాహుల్ రామకృష్ణలతో పాటు `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ` హీరో నవీన్ పొలిశెట్టి కథానాయకులుగా నటించనున్నారట. ఇందులో కథానాయికగా షాలిని పాండే ని ఎంచుకున్నట్టు సమాచారం. ఇందులో షాలినీ ఓ న్యాయవాదిగా కనిపించనుందట. స్క్రిప్ట్ సనులు పూర్తిచేసుకున్న ఈ సినిమాను త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లనునన్నట్లు తెలుస్తోంది.