టాలీవుడ్ లో విషాదం.. సీనియర్ నటుడు కాస్ట్యూమ్ కృష్ణ కన్నుమూత!
on Apr 2, 2023
తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు, నిర్మాత కాస్ట్యూమ్ కృష్ణ మూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం చెన్నైలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.
కాస్ట్యూమ్ కృష్ణ స్వస్థలం విజయనగరం జిల్లా, లక్కవరపుకోట. 1954లో చెన్నై వెళ్లి అసిస్టెంట్ కాస్ట్యూమర్‌గా సినిమారంగంలో ప్రవేశించారు. అతి తక్కువ కాలంలోనే కాస్ట్యూమ్ డిజైనర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి లాంటి స్టార్ హీరోలతో పాటు వాణిశ్రీ, జయసుధ, జయప్రద, శ్రీదేవి లాంటి హీరోయిన్లకు కూడా కాస్ట్యూమ్స్ అందించారు.
కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన 'భారత్ బంద్' సినిమాతో కాస్ట్యూమ్ కృష్ణ నటుడిగా పరిచయమయ్యారు. అల్లరి మొగుడు, దేవుళ్ళు, మా ఆయన బంగారం, శాంభవి ఐపిఎస్, పుట్టింటికి రా చెల్లి వంటి అనేక సినిమాల్లో నటించిన ఆయన విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించారు. నిర్మాతగానూ 8 సినిమాలు నిర్మించారు. జగపతి బాబు హీరోగా వచ్చిన 'పెళ్ళిపందిరి' చిత్రాన్ని నిర్మించిన ఆయన ఆ తర్వాత సినీ పరిశ్రమకు దూరంగా ఉంటున్నారు. చెన్నైలో సాధారణ జీవితాన్ని గడుపుతున్న ఆయన అనారోగ్యంతో ఏప్రిల్ 2న ని తన నివాసంలో కన్నుమూశారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
