'దొంగముద్దు'తో దర్శకుడిగా మారుతున్న ధీరజ అప్పాజీ
on Apr 2, 2023
ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ ధీరజ అప్పాజీ ఓ వెబ్ సిరీస్ తో దర్శకుడిగా మారుతున్నారు. ప్రణయ కలహం నేపథ్యంలో రూపొందనున్న ఈ వెబ్ సిరీస్ కి 'దొంగముద్దు' అనే టైటిల్ ఖరారు చేశారు. పీఆర్వోగా రెండొందలు పైచిలుకు చిత్రాలకు పని చేసి, ఫిల్మ్ జర్నలిస్ట్ గా తెలుగు చిత్ర పరిశ్రమతో రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుబంధం కలిగిన అప్పాజీ రచయిత కూడా. వెన్నెల కురిసిన రాత్రి, మావయ్య, విప్లవం వర్ధిల్లాలి వంటి కథలు అప్పాజీ రచనా ప్రావీణ్యానికి తార్కాణంగా నిలుస్తాయి. పలు సినీ వార పత్రికలకు ఎడిటర్ గా, పలు పాపులర్ వెబ్ సైట్స్ కు కంటెంట్ రైటర్ గా పని చేసిన అప్పాజీ... ఓ దినపత్రిక సినిమా విభాగం ఎడిటర్ గానూ వ్యవహరించారు. అప్పాజీ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'దొంగముద్దు'కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
