ఎన్టీఆర్ సృష్టించిన రికార్డులు తెలుసా?
on May 28, 2020
విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ నందమూరి తారక రామారావు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చిరునామా లాంటి వ్యక్తి. తాను పైకి ఎదుగుతూ, తెలుగు చిత్ర పరిశ్రమను పైకి తీసుకొచ్చిన ఖ్యాతి ఆయనది. నట ప్రస్థానంలో ఎన్టీఆర్ ఎన్నో రికార్డులు సృష్టించారు. తెలుగు తెరకు రాముడు, కృష్ణుడు, భగవంతుడు ఆయనే. రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన ఎన్టీఆర్, ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు. ఎన్టీఆర్ నెలకొల్పిన రికార్డులలో కొన్ని రికార్డుల గురించి ఈతరం ప్రేక్షకులు సైతం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవేంటో ఒకసారి చూడండి.
‣ కథానాయకుడిగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన తర్వాత, తొలి 20 ఏళ్ళల్లో ఎన్టీఆర్ 200 సినిమాలు చేశారు. ఆ కాలంలో మిగతా హీరోలు చేసిన సినిమాల సంఖ్య సైతం రెండొందలకు అటు ఇటుగా ఉండడం గమనించదగ్గ అంశం.
‣ కెరీర్ లో 300లకు పైగా సినిమాల్లో ఎన్టీఆర్ నటించారు. అందులో 200 సినిమాలు నిర్మాతలకు లాభాలు తీసుకొచ్చాయి. మరో 50 సినిమాలు మొదటిసారి విడుదలైనప్పుడు నష్టాలు వచ్చినా, రెండోసారి విడుదలైనప్పుడు లాభాలు తీసుకొచ్చాయి.
‣ ఎన్టీఆర్ నటించిన సినిమాల్లో 99 శాతం సినిమాలు మళ్ళీ కొత్త ప్రింట్లతో రీరిలీజ్ అయ్యాయి. ఇతర హీరోలు ఎవరికీ ఈ ఘనత దక్కలేదు. తమిళనాట ఎంజీఆర్, తెలుగులో ఎన్టీఆర్ కి మాత్రమే సాద్యమైంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
