ఐశ్వర్యారాయ్ సరబ్ జిత్ : ట్రైలర్ రివ్యూ
on Apr 14, 2016

బాలీవుడ్ లో బయోపిక్స్ చితగ్గొట్టేస్తున్నారు. బయోపిక్స్ తీయడమనేది మామూలు విషయం కాదు. వాటిలో ఎన్నో అడ్డంకులుంటాయి. వాటన్నింటినీ దాటుకుని ఎక్స్ ట్రార్డినరీగా సినిమాల్ని రూపొందిస్తున్నారు. నిన్న మొన్నొచ్చిన నీర్జా, కలెక్షన్లు కుమ్మేసుకుంది. అంతకుముందు భాగ్ మిల్కా భాగ్, మేరీ కోమ్ సినిమాలు కూడా విమర్శకుల ప్రశంసల్ని పొందాయి. ఇప్పుడు లేటెస్ట్ బాలీవుడ్ సెన్సేషనల్ మూవీ సరబ్ జిత్. ఈరోజే ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
పాకిస్థాన్ కు చిక్కిన సరబ్ జిత్ అనే ఒక భారతీయ రైతును అక్కడెన్ని చిత్రహింసలు పెట్టారో తెలియని వాళ్లు చాలా తక్కువ మందే ఉంటారు. అతనికి కనీసం సరైన తిండి, బట్ట సదుపాయం కూడా కల్పించకుండా, మనిషి పూర్తిగా పడుకోలేనంత చిన్న చీకటి గదిలో దాదాపు 20 ఏళ్ల పాటు నిర్బంధించింది పాక్. సరబ్ జిత్ ఏమైపోయాడో తెలియని అతని సోదరి దల్బీర్ కౌర్ అతని కోసం వెతికి వెతికి చివరకు పాకిస్థాన్ జైల్లో ఉన్నాడని తెలుసుకుంటుంది. అతన్ని విడిపించడానికి ఆమె పడే యాతన, ఆమె మనసు పడే వేదనే సరబ్ జిత్ సినిమా సారాంశం. ఇక్కడ కసబ్ ను ఉరితీసినందుకు ప్రతీకారంగా, సరబ్ జిత్ ను కూడా పాక్ చంపేసింది. సినిమాలో ఇదే చూపించబోతున్నారా లేక సరబ్ జిత్ పాత్రను బయటికి తీసుకొస్తారా అన్నది ఆసక్తికరం. దల్బీర్ పాత్రలో ఐశ్వర్య ఒదిగిపోయింది. ఇక సరబ్ జిత్ పాత్రను జీవించడం కోసం బక్కచిక్కిపోయి సగమైపోయాడు రణ్ దీప్ హుడా. మేరీకోమ్ తీసిన ఒమంగ్ కుమార్, సరబ్ జిత్ ను డైరెక్ట్ చేశాడు. మే 20 న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ట్రైలర్ అయితే టాప్ నాచ్ గా ఉంది. సినిమా కూడా ఇదే టెంపో మెయింటెయిన్ చేస్తే, బాలీవుడ్ లో మరో బయోపిక్ సూపర్ హిట్ ఖాయం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



