రాజ్‌తరుణ్ కత్తి..తురుము..!
on Apr 14, 2016
.jpg)
ఉయ్యాలా జంపాలా సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ మూవీతోనే హిట్ కొట్టిన హీరో రాజ్ తరుణ్. ఆ వెంటనే సినిమా చూపిస్తా మావ, కుమారి 21ఎఫ్‌లతో హ్యాట్రిక్ హిట్స్ తన ఎకౌంట్‌లో వేసుకున్నాడు ..ప్రజంట్ చిన్న నిర్మాతల పాలిట కల్పవృక్షంలా మారిపోయాడు. భారీ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా సినిమాలు రిలీజ్ చేసి హిట్ కొడుతూ స్లో పాయిజన్‌లా దూసుకుపోతున్నాడు. ప్రజంట్ మంచు విష్ణుతో కలిసి సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకున్నాడు రాజ్. ఈ సినిమా విడుదలైన ఫస్ట్ అవర్ నుంచే సక్సెస్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా హిట్ కావడానికి మెయిన్ రీజన్ రాజ్ తరుణే అంటున్నారు సినీ పండితులు.
విష్ణు కెరిర్‌లోనే దేనికైనారెడీ లాంటి భారీ హిట్ ఇచ్చిన జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో ఈ మూవీ రావడంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. అయితే వాటన్నింటిని పక్కకు నెట్టి సినిమాను తన భుజాలపై ఎత్తుకున్నాడట తరుణ్. తన ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్‌తో సినిమాకు జోష్ తీసుకువచ్చాడు. ముఖ్యంగా తన కామెడీ టైమింగ్‌తో ఆడియన్స్ చేత విజిల్స్ వేయించాడు. మొత్తానికి ఈ డైరెక్టర్ టర్న్‌డ్ హీరో టాలీవుడ్‌లో తన జోరు చూపిస్తున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



