సమంత నయా కోరిక
on Nov 22, 2014
ప్రతీ కథానాయికకూ కొన్ని సొంత ఇష్టాయిష్టాలుంటాయి. ఎంత కమర్షియల్ సినిమాల్లో వెలిగిపోతున్నా.. ఎప్పుడో ఓసారి ఆర్ట్ సినిమాల్లోనూ నటించాలని, అవార్డులు అందుకోవాలని అనిపిస్తుంటుంది. సరిగ్గా సమంతకూ ఇదే కోరిక కలిగింది. అర్జెంటుగా ఓ సందేశాత్మక చిత్రంలో నటించాలని వుంది.. అంటూ తన మనసులోని కోరిక బయటపెట్టింది. ఇటీవలే విడుదలైన `నా బంగారు తల్లి` సినిమాని సమంత కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ సినిమా చూసి సమంత చలించిపోయిందట. ఇలాంటి విలువలున్న చిత్రంలో నటించాలని ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే ఇలాంటి సినిమాలో నటించమని ఎవ్వరూ అడగలేదు. ఈ తరహా మెసేజ్ ఓరియెంటెడ్ కథతో ఎవరైనా వస్తే.. తప్పకుండా ఒప్పుకొంటా, బహుశా వచ్చే ఏడాది ఇలాంటి సినిమాలో నటించే అవకాశం ఉంది.. అని చెప్తోంది సమంత. తాను రిటైర్ అయ్యేలోగా ఈ తరహా కథలో నటించేస్తే.. ఓ పనైపోతోందనని ఫీలవుతోంది ఈ చుల్‌బుల్ సుందరి. మరి సమంత కోసం `నా బంగారు తల్లి`లాంటి హార్ట్ టచింగ్ స్టోరీ ఎవరు రాసుకొస్తారో మరి! దర్శకులూ ఆ పనిలో ఉండండిక!!