Home

»

Latest News

ప్రీత‌మ్‌తో క‌లిసి ర‌చ్చ చేసిన స‌మంత‌

Nov 19, 2021 1:46PM

అక్కినేని నాగ‌చైత‌న్య‌తో విడాకులు తీసుకుంటున్న‌ట్టుగా ప్ర‌క‌టించిన స‌మంత ఆ త‌రువాత కొన్ని రోజులు సైలెంట్‌గా వుండిపోయింది. సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న మ‌న‌సులోని భావాల్సి వ్య‌క్తం చేసేందుకు త‌న‌దైన తీరు పోస్ట్ ల‌తో సంచ‌ల‌నం సృష్టించింది. ఆ త‌రువాత త‌న స్నేహితురాలుతో క‌లిసి ఛార్‌ధామ్ యాత్ర‌కు వెళ్లింది. అక్క‌డ కొన్ని ప్ర‌త్యేక పూజ‌లు చేసి కొత్త ఉత్సాహంతో తిరిగి వ‌చ్చింది. అప్ప‌టి నుంచి సోష‌ల్ మీడియాలో త‌న‌దైన స్టైల్లో వీడియోల‌ని పోస్ట్ చేస్తూ ఆక‌ట్టుకుంటోంది.

స‌మంత కు అత్యంత స‌న్నిహితంగా వుండే వాళ్ల‌లో స్టైలిస్ట్ ప్రీత‌మ్ జుకాల్క‌ర్ ఒక‌డు కాగా మ‌రొక‌రు సాధ‌న సింగ్‌. సామ్ చేసే ప‌నుల్లో వీరిద్ద‌రి పాత్ర త‌ప్ప‌నిస‌రి. తాజాగా `పుష్ప‌` కోసం ప్ర‌త్యేక గీతంలో న‌టించ‌డానికి అంగీక‌రించిన స‌మంత త‌న స్నేహితుల‌తో క‌లిసి సోష‌ల్ మీడియాలో అల్ల‌రి చేస్తోంది. తాజాగా సామ్ పోస్ట్ చేసి ఓ వీడియో ప‌లువురిని ఆకట్టుకుంటోంది.

ప్రీత‌మ్ జుకాల్క‌ర్‌తో క‌లిసి సాధ‌న సింగ్‌ని ఓ ఆట‌ప‌ట్టించింది స‌మంత‌. సాధ‌న సింగ్‌కు ప్రీత‌మ్ జుకాల్క‌ర్‌తో క‌లిసి మేక‌ప్ వేసిన స‌మంత ఆమెని చిత్ర విచిత్రంగా మార్చి ఎంజాయ్ చేసింది. ఇందుకు ప‌సంబంధించిన ఓ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతోంది. గుణ‌శేఖ‌ర్ `శాకుంత‌లం`ని పూర్తి చేసి స‌మంత ప్ర‌స్తుతం వ‌రుస‌గా సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేస్తోంది.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com