సినిమా బండి దర్శకుడితో సమంత శుభం!
on Mar 15, 2025
ప్రముఖ నటి సమంత నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. త్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై సమంత నిర్మిస్తున్న తొలి ప్రాజెక్ట్ 'శుభం' చిత్రీకరణ విజయవంతంగా పూర్తయిది. త్వరలోనే ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. కామెడీ ఎంటర్టైన్మెంట్తో పాటు థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా ఈ చిత్రం ఉండనుందని సమాచారం. (Samantha Ruth Prabhu)
వసంత్ మరిగంటి రాసిన ఈ కథను 'సినిమా బండి' ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల తెరకెక్కిస్తున్నారు. త్రాలాల బ్యానర్ మీద ఈ సినిమాను మొదటి ప్రాజెక్ట్‌గా ఎందుకు ఎంచుకున్నామో త్వరలోనే అందరికీ తెలుస్తుందని సమంత అన్నారు. ఈ చిత్రంలో సి.మల్గిరెడ్డి, శ్రియ కొంఠం, చరణ్ పెరి, షాలిని కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్, శ్రావణి ముఖ్య పాత్రల్ని పోషించారు.
శుభం చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా మృదుల్ సుజిత్ సేన్, ప్రొడక్షన్ డిజైనర్‌గా రామ్ చరణ్ తేజ్, ఎడిటర్‌గా ధర్మేంద్ర కాకర్లాడ్ పని చేస్తున్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
