మొన్న రకుల్ ప్రీత్‌సింగ్... ఇప్పుడు సమంత & చైతూ
on Aug 26, 2019
రీసెంట్‌గా రకుల్ ప్రీత్‌సింగ్ హాట్ హాట్ బికినీ ఫొటోలతో సందడి చేసింది. అంత త్వరగా కుర్రకారు ఆ ఫొటోలను మర్చిపోలేరు. స్పెయిన్‌లోని ఇబిజా సముద్రతీర ప్రాంతానికి హాలీడేకి వెళ్లినప్పుడు రకుల్ ఆ ఫొటోలు దిగారు. మొన్న మొన్ననే అక్కణ్ణుంచి ఆమె వచ్చారు. సేమ్ ప్లేస్‌కి ఇప్పుడు అక్కినేని యువ జంట నాగచైతన్య, సమంత వెళ్లారు. వాళ్లతో నాగార్జున చిన్నబ్బాయ్ అఖిల్, మరికొంతమంది స్నేహితులు ఉన్నారు. ఆల్రెడీ అందరూ స్పెయిన్‌లో ల్యాండ్ అయ్యారు. ‘‘శ్రీమతిగారు రెడీ అవుతుంటే వెయిట్ చేస్తున్నాను’’ అంటూ చైతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ కూడా చేశారు. కొన్ని రోజులు పాటు ఇబిజాలో వీరందరూ షికారు చేయనున్నారు. హాలీడే ట్రిప్ అన్నమాట! ఈ ఏడాది నాగచైతన్య, సమంత జంటగా నటించిన ‘మజిలీ’ మంచి విజయం సాధించింది. సమంత సోలోగా నటించిన ‘ఓ బేబీ’ కూడా హిట్టే. అయితే... ఇటు చైతూ ‘వెంకీ మామ’, అటు సమంత ‘96’ రీమేక్ చేస్తుండటంతో దంపతులు ఇద్దరికీ హాలీడేకి వెళ్లే వీలు చిక్కలేదట. అందరి షెడ్యూల్స్ చెక్ చేసుకుని ఈ టూర్ ప్లాన్ చేశారని టాక్.