భీమనేనిని ఆడియన్స్ తిట్టుకుంటున్నారట!!
on Aug 26, 2019
'కౌసల్య కృష్ణమూర్తి' సినిమా చూసిన ప్రేక్షకులు దర్శకుడు భీమనేని శ్రీనివాసరావును తిట్టుకుంటున్నారట. మంచి సినిమానే తీసాడు కదా, మరీ చెత్త సినిమా ఏం తీయలేదు కదా... ప్రేక్షకులు ఎందుకు తిట్టుకుంటున్నారు అనే కదా మీ సందేహం. ప్రేక్షకులు భీమనేనిని తిట్టుకునేది ఆయన డైరక్షన్ గురించి కాదు...ఆ సినిమాలో ఆయన పోషించిన నెగిటివ్ షేడ్స్‌తో ఉన్న క్యారక్టర్ గురించి తిట్టుకుంటూ, మంచి సినిమా తీసారంటూ మెచ్చుకుంటున్నారట. ఈ విషయాన్ని ఈ రోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు భీమనేని. ఇక ఆయన దర్శకత్వం వహించిన 'కౌసల్య కృష్ణమూర్తి' చిత్రం ఈ నె 23న విడుదలై పర్వాలేదనిపించుకుంటోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశం లో ఆయన పై విధంగా స్పందించారు. ఇక 'సుడిగాలి 2' గురించి స్పందిస్తూ.. "ఆ సినిమాకు సంబంధించి కొంత స్క్రిప్ట్ వర్క్ కూడా చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం టీమీ ఛానల్స్‌లో వచ్చే కామెడీ షోలలో రీసెంట్ రిలీజ్ అయ్యే సినిమాలకు సంబంధించిన స్ఫూప్స్ మరుసటి రోజే వాడేస్తున్నారు. ఇలాంటి సమయంలో మళ్లీ ఆ స్ఫూప్స్‌తో సినిమా తీస్తే ..ఆడియన్స్ థియేటర్స్ కి రావడం కష్టమే. అయితే రెండు మూడు ఏళ్ల తర్వాత తీస్తే బాగుంటుందన్న ఆలోచనతో ప్రజంట్ దాన్ని పక్కన పెట్టాం" అంటూ చెప్పుకొచ్చారు దర్శకుడు భీమనేని.