సల్మాన్ పెళ్లిపై ఆమె రియాక్షన్..!
on May 17, 2016
సల్మాన్ ఖాన్ పెళ్లి గురించి బాలీవుడ్ చాలా ఆసక్తిగా చర్చించుకుంటోంది. తన రొమేనియన్ గర్ల్ ఫ్రెండ్ లూలియా వంతూర్ ను ఈ కండల కాంతారావు నిజంగానే పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యాడో లేదో తెలియదు కానీ తోటి వాళ్లందరూ మాత్రం, సల్లూ భాయ్ ఒక ఇంటి వాడు కావాలని కోరుకుంటున్నారు. ఈ లిస్ట్ లో జరైన్ ఖాన్ కూడా ఉంది. అప్పట్లో కత్రినాకు లైన్ వేసిన సల్మాన్, ఆమెతో విడిపోయిన తర్వాత అచ్చం తనలాగే ఉన్న జరైన్ ఖాన్ ను సినిమా ఇండస్ట్రీలోకి తీసుకొచ్చి ఛాస్సులు ఇప్పించాడు. ప్రస్తుతం ఈ భామ కెరీర్ బాగానే ఉంది. తాజాగా తన గురువు సల్లూభాయ్ పెళ్లి గురించి విలేకరులు అడిగిన దానికి డైరెక్ట్ గా ఆన్సర్ ఇచ్చేసిందీ భామ. సల్మాన్ కు లూలియా కు పెళ్లి జరిగితే, సంతోషించే వాళ్లలో నేను ముందు వరసలో ఉంటాను. నేనే కాదు, దేశమంతా మావోడి పెళ్లి కోసం ఎదురుచూస్తున్నారంటూ క్లియర్ గా చెప్పేసింది. ప్రస్తుతానికి అందరూ ఈ ముదురు బ్యాచిలర్ గారి పెళ్లి గురించి తెగ ఆలోచించేస్తున్నారు. ఇంతకీ అసలు ఆయన ఏమనుకుంటున్నాడో...!