పవన్ మంచి ఛాన్సే ఇచ్చాడుగా...!
on May 17, 2016

తెలుగు హీరోల్లో ఒకసారి చేసిన హీరోయిన్ తో మళ్లీ చేయని హీరోలు కొంతమంది ఉన్నారు. ఆ హీరోలతో రెండు సార్లు నటించిందంటే, ఆ హీరోయిన్ చాలా టాలెంటెడ్ అయినా అయి ఉండాలి..లేదా లక్కీ అయి ఉండాలి. మళ్లీ మళ్లీ నటించని ఈ కేటగిరీ హీరోలు మెగా ఫ్యామిలీలోనే ఇద్దరున్నారు. ఒకరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే, మరొకరు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. బన్నీ సినిమాల్లో తన పెయిర్ గా మూడు సార్లు నటించింది కేవలం క్యాథరీన్ ట్రెసాతో మాత్రమే. అనుష్కతో రెండు సార్లు నటించినా, ఆ రెండింటిలోనూ ఆమె సరసన తన పాత్ర లేదు. సేమ్ అలాగే పవర్ స్టార్ ట్రాక్ కూడా ఉంటుంది. ఆయసతో రెండుసార్లు చేసిన ఏకైక హీరోయిన్ రేణు దేశాయ్ మాత్రమే. త్రిష తీన్ మార్ తో పాటు బంగారం సినిమా చివరిలో పవన్ తో కనబడినా, అది లెక్కలోకి రాదు. ఇలా వీళ్లిద్దరి సినిమాల్లో రెండు సార్లు చేయాలంటే, హీరోయిన్లకు రాసి పెట్టి ఉండాలి. తాజాగా పవన్ ఇలాంటి ఛాన్స్ ను శృతి హాసన్ కు ఇచ్చాడు. గబ్బర్ సింగ్ లో ఇద్దరి హిట్ పెయిర్ ఇరగదీయడంతో, సెంటిమెంట్ గా ఎస్ జే సూర్య సినిమాలో కూడా శృతికే అవకాశం ఇచ్చాడు పవన్. ఫ్యాక్షన్ లవ్ అండ్ కామెడీగా రాబోతున్న ఈ సినిమాతో, గబ్బర్ సింగ్ హిట్ రేంజ్ హిట్ రిపీట్ అవుతుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



