గడ్డి తిన్న సల్మాన్ ఖాన్!
on Apr 10, 2020
తప్పుగా ఏమీ రాయలేదు. మీరు చదివింది నిజమే. నిజంగా, సల్మాన్ ఖాన్ గడ్డి తిన్నారు! సాధారణంగా గడ్డి తినడం, గడ్డి కరవడం వంటి పదాలను అవినీతి, అక్రమాలకు పాల్పడిన సందర్భాల్లో ఉపయోగిస్తారు. ఆ పదాల్లో అంత అర్థం దాగుంది. ఇక్కడ, 'గడ్డి తిన్న' పద ప్రయోగంలో అటువంటి ద్వందార్థాలు ఏమీ లేవు. నిజంగా, సల్మాన్ ఖాన్ గడ్డి తిన్నారు.
అసలు మేటర్ ఏంటంటే... ప్రస్తుతం మేనల్లుడు నిర్వాన్ ఖాన్‌తో కలిసి ఫామ్‌హౌస్‌లో ఉన్నట్టున్నారు సల్మాన్. అక్కడ ఆయనకు గుర్రాలు కూడా ఉన్నాయి. శుక్రవారం ఉదయం గుర్రానికి గడ్డి తినిపించే ముందు తాను కూడా కొంచెం తిన్నారు. అదీ సంగతి. ఈ గడ్డి తనే వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఆయన దానికి 'Breakfast with my love..' అనే కాప్షన్ జోడించారు. సరదాగా ఇటువంటి పనులు చేయడం సల్మాన్‌కి అలవాటే. కాకపోతే... మొన్నామధ్య ప్రధాని నరేంద్రమోడీ నియోజకవర్గమైన వారణాసిలో కొందరు పిల్లలు ఆకలితో గడ్డి తినడం చర్చనీయాంశం అయింది. ఇక్కడ హీరో తిన్నారు కాబట్టి ఫన్నీ టాపిక్ అయింది.