
మెగా మేనల్లుడిగా టాలీవుడ్లో అడుగుపెట్టి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో సాయి ధరమ్ తేజ్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. గత కొంతకాలంగా ఆయన పెళ్లి గురించి వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా నిశ్చితార్థం, పెళ్లి తేదీలు కూడా ఖరారయ్యాయంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో మెగా అభిమానుల్లో ఈ వార్త ఆసక్తికరంగా మారింది.
నవంబర్ 5న హైదరాబాద్లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం జరగనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ వేడుకను చాలా నిరాడంబరంగా నిర్వహించాలని ఇరు కుటుంబాలు భావిస్తున్నాయట. అయితే సాయి తేజ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరో ఇంకా పూర్తి వివరాలు బయటకు రాలేదు. ఆయన తన చిన్ననాటి స్నేహితురాల్ని వివాహం చేసుకోబోతున్నట్లు న్యూస్ వినిపిస్తోంది.
ఇక ప్రస్తుతం ప్రచారంలో ఉన్న సమాచారం ప్రకారం.. డిసెంబర్ 10న సాయి ధరమ్ తేజ్ వివాహం జరగనుందట. పెళ్లి వేడుక పూర్తయిన తర్వాత హైదరాబాద్లో సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, ఇతర సన్నిహితుల కోసం ప్రత్యేకంగా రిసెప్షన్ ఏర్పాటు చేయాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ 'సంబరాల ఏటి గట్టు' సినిమాతో బిజీగా ఉన్నారు. రోహిత్ కేపీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: మహేష్ బాబు మరో కొత్త బిజినెస్!

[Sai Dharam Tej Wedding Date, Sai Dharam Tej Marriage Date, Sai Dharam Tej Engagement, Sai Durgha Tej Marriage, Sai Dharam Tej, Sambharala Yeti Gattu, Telugu Film News]






