Home

»

Latest News

మహేష్ బాబు మరో కొత్త బిజినెస్: నేషనల్ కాదు ఇంటర్నేషనల్.!

Nov 3, 2026 11:21AM

సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు మరో కొత్త రంగంలోకి అడుగుపెట్టారు. ఇప్పటివరకు సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఆయన.. ఇప్పుడు అంతర్జాతీయ గేమింగ్‌ పరిశ్రమలోనూ తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమయ్యారు. ముంబైకి చెందిన ప్రముఖ ఇంటరాక్టివ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ షార్ట్‌గన్‌ గేమ్స్‌ (Shotgun Games)లో వ్యూహాత్మక పెట్టుబడిదారుగా భాగస్వామి అయ్యారు. దీంతో మహేశ్‌ వ్యాపార ప్రయాణంలో మరో ఆసక్తికరమైన అధ్యాయం మొదలైంది.

ఈ భాగస్వామ్యంలో భాగంగా షార్ట్‌గన్‌ గేమ్స్‌ ‘టేక్‌డౌన్‌: జెనెసిస్‌’ (Takedown: Genesis) పేరుతో భారీ యాక్షన్‌ అడ్వెంచర్‌ గేమ్‌ను అభివృద్ధి చేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ గేమ్‌ను రూపొందిస్తున్నారు. సంస్థ సహ వ్యవస్థాపకులు జీత్‌ చందన్‌, విధిత్‌ మెహతాతో కలిసి మహేశ్‌ ఈ ప్రాజెక్టులో భాగస్వామి అయ్యారు. ప్రముఖ దర్శకుడు విక్కీ అరోరా నేతృత్వంలో గేమ్‌ రూపుదిద్దుకుంటున్నట్లు సమాచారం.

ఇప్పటికే సినిమాలతో పాటు పలు వ్యాపార రంగాల్లోనూ ఆసక్తి చూపిస్తున్న మహేశ్‌.. ఇప్పుడు గేమింగ్‌ పరిశ్రమలోకి అడుగుపెట్టడం ఆసక్తికరంగా మారింది. మరి ‘టేక్‌డౌన్‌: జెనెసిస్‌’ అంతర్జాతీయ గేమింగ్‌ మార్కెట్‌లో ఎలాంటి గుర్తింపు తెచ్చుకుంటుందో చూడాలి.

ఇది కూడా చదవండి: స్పిరిట్‌.. ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ తెప్పించే అప్డేట్.!

 

 

 

[Mahesh Babu New Business, Mahesh Babu Gaming Industry, Mahesh Babu, Shotgun Games, Takedown Genesis, Vicky Arora, Indian Gaming Industry, Telugu News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com