విమర్శలు 'సాహో' డైరెక్టర్‌కి ఎక్స్‌ట్రా బూస్ట్!
on Sep 4, 2019
'రన్ రాజా రన్'తో డైరెక్టర్‌గా పరిచయమై, రెండో సినిమాలోనే 'బాహుబలి' ప్రభాస్‌ను డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకొని 'సాహో' మూవీ తీసిన సుజీత్ భావోద్వేగానికి గురయ్యాడు. ఇన్‌స్టాగ్రాం ద్వారా తన భావాల్ని పంచుకున్నాడు.
"17 సంవత్సరాల వయసులో నా తొలి షార్ట్ ఫిల్మ్ తీశాను. అప్పుడు నా దగ్గర డబ్బు లేదు, టీం లేదు. కానీ 'ఆర్కుట్', నా కుటుంబం నుంచి చాలా సపోర్ట్ దొరికింది. నేను తీసిన వాటిలో 90 శాతం షార్ట్ ఫిలిమ్స్‌ని నేనే ఎడిట్ చేసి, నేనే షూట్ చేసి, డైరెక్ట్ చేశాను. నా తప్పుల నుంచి నేను నేర్చుకున్నా. విమర్శలనేవి ఎప్పుడూ నా జర్నీకి అదనపు బూస్ట్‌నిస్తాయి. చాలా దూరం ప్రయాణించాను, ఎన్నో అడ్డంకుల్ని ఎదుర్కొన్నా. బట్ నెవర్ గేవ్ అప్. 'సాహో'ను ఇవాళ అనేకమంది చూశారు. కొంతమంది దాన్నుంచి ఇంకా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ ఎక్కువమంది దాన్ని ఇష్టపడ్డారు! సినిమాని చూసిన వాళ్లందరికీ థాంక్స్. మీరు ఏదైనా మిస్సయితే దయచేసి మరోసారి చూడండి. మీరు మరింత ఎంజాయ్ చేస్తారని చెప్పగలను. సాహో" అని పోస్ట్ చేశాడు.
అతని పోస్ట్‌కు 'సాహో'లో కీలక పాత్ర చేసిన బాలీవుడ్ యాక్టర్ నీల్ నితిన్ ముఖేశ్ స్పందించాడు. "గాడ్ బ్లెస్ యు బ్రదర్. జెమ్ లాంటి ఈ సినిమా తీసినందుకు నువ్వు గర్వించాలి. నేను చూసిన, నేను భాగమైన సినిమాల్లో టెక్నికల్‌గా బెస్ట్ అనేవాటిలో ఇదొకటి. ఒక ప్రేక్షకుడిగా, టికెట్లు కొని నా కుటుంబ సభ్యులందరితో, మిగతా అందరు ఫ్యాన్స్‌తో పాటు ఈ సినిమా చూశాను. ఎక్కడా మేం డిజప్పాయింట్ అవ్వలేదు. ఒకరి హార్డ్ వర్క్‌నీ, లెక్కపెట్టలేనన్ని గంటలున్న ఎన్నో ఏళ్ల విజన్‌నీ జడ్జ్ చెయ్యడం సులభం. అనేక కేరెక్టర్లతో, గొప్ప విజువల్స్‌తో, అద్భుత అభినయాలతో సినిమా తియ్యడం ఒక టాస్క్. ట్విస్టులు, మలుపులు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఇక యాక్షన్ సీన్స్ తీసిన విధానం అయితే ఎక్సలెంట్. నీతో కలిసి పనిచెయ్యడం గౌరవంగా భావిస్తున్నా" అని షేర్ చేశాడు.