తమన్.. 2022 పొంగల్ `డబుల్ ధమాకా`!
on Jan 5, 2022

ఈ మధ్య యువ సంగీత సంచలనం తమన్ పట్టిందల్లా బంగారమే. గత ఏడాది అయితే.. `క్రాక్`, `వకీల్ సాబ్`, `అఖండ` ఇలా స్టార్ హీరోల కాంబినేషన్స్ లో చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ ముంగిట వసూళ్ళ వర్షం కురిపించాయి. ఈ క్రమంలోనే.. ఈ సంవత్సరం కూడా పలు బిగ్ టికెట్ ఫిల్మ్స్ తో సందడి చేయనున్నాడు తమన్. `గాడ్ ఫాదర్`, `ఎన్బీకే 107`, `భీమ్లా నాయక్`, `సర్కారు వారి పాట`, `రాధే శ్యామ్` (నేపథ్య సంగీతం).. ఇలా మంచి లైనప్ నే ఉంది 2022లో.
ఇదిలా ఉంటే.. తన లక్కీ సీజన్స్ లో ఒకటైన సంక్రాంతికి మరోసారి సందడి చేయడానికి సిద్ధమయ్యాడు తమన్. అయితే, 2020లో `అల వైకుంఠపురములో`, 2021లో `క్రాక్` తరహాలో పెద్ద సినిమాలతో కాకుండా లో-బడ్జెట్ మూవీస్ తో ఈ ముగ్గుల పండక్కి మురిపించనున్నాడీ `కిక్` కంపోజర్. విశేషమేమిటంటే.. ఈ పొంగల్ కి రాబోతున్న తమన్ మ్యూజికల్స్ రెండు కూడా జనవరి 14నే రిలీజ్ కాబోతున్నాయి. ఆ చిత్రాలే.. `సూపర్ మచ్చి`, `డీజే టిల్లు`. కళ్యాణ్ దేవ్, రచితా రామ్ జంటగా నటించిన `సూపర్ మచ్చి`కి తమన్ స్వరాలు సమకూర్చగా.. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జోడీగా అలరించనున్న `డీజే టిల్లు`కి నేపథ్య సంగీతమందించాడు.
మరి.. ఒకే రోజున రాబోతున్న ఈ చిత్రాలతో తమన్ ఎలాంటి ఫలితాలను అందుకుంటాడో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



